Home Actor రాజు గారి గ‌ది 3 లో న‌టించేది ఎవ‌రు..?

రాజు గారి గ‌ది 3 లో న‌టించేది ఎవ‌రు..?

110
0


యాంక‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ ఓంకార్ తెర‌కెక్కించిన హ‌ర్ర‌ర్ కామెడీ రాజు గారి గ‌ది. 2015లో రిలీజైన ఈ సినిమాలో అశ్విన్ బాబు, ధ‌న్య‌బాల‌క్రిష్ట‌న్, ధ‌న‌రాజ్, రాజీవ్ క‌న‌కాల ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. హ‌ర్ర‌ర్ కామెడీతో పాటు మంచి సందేశాన్ని కూడా అందించిన ఈ సినిమా ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో మంచి విజ‌యాన్నిసాధించింది. ఆత‌ర్వాత ఈ క‌థ‌కు సంబంధం లేక‌పోయినా రాజు గారి గ‌ది 2 టైటిల్ తో ఓంకార్ మ‌రో సినిమా తెర‌కెక్కించారు. ఇందులో నాగార్జున‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్స్, ఓఏకే ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. 2017లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రాజు గారి గ‌ది 2 ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇదిలా ఉంటే…ఇప్పుడు రాజు గారి గ‌ది 3 సినిమా తీయ‌డానికి ఓంకార్ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల ఓంకార్ త‌మ‌న్నాకి క‌థ చెప్ప‌డం..క‌థ విని త‌మ‌న్నా ఓకే చెప్పింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. తమ‌న్నా వేరే సినిమాల్లో బిజీగా ఉంది. త‌మ‌న్నా డేట్స్ విష‌యంలో క్లారిటీ వ‌చ్చిన త‌ర్వాత రాజు గారి గ‌ది 3 చిత్రాన్ని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని తెలిసింది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here