Home Political News రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మే ఈ దాడులు – ఉద‌య్ సింహ‌

రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మే ఈ దాడులు – ఉద‌య్ సింహ‌

100
0
income tax officers

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేయ‌డం..రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయిన విష‌యం తెలిసిందే. ఈరోజు ఐటీ కార్యాల‌యంలో ఉద‌య్ సింహను అధికారులు విచారించారు. ఐటీ అధికారులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మ‌రింత స‌మ‌యం కావాల‌ని ఉద‌య్ సింహ కోరగా అధికారులు ఈ నెల 3వ తేదీ వ‌ర‌కు స‌మ‌యం ఇచ్చారు. అయితే…ఈ విచార‌ణ‌లో ఐటీ అధికారులు షాక్ అయ్యే సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే…నిన్న చైత‌న్య పురిలోని ఉద‌య్ సింహ బంధువు ర‌ణ‌ధీర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులంటూ 15 మంది సోదాలు చేసారట‌. బంగారం, న‌గ‌దు, సెల్ ఫోన్లు తీసుకెళ్లారట‌. దీని గురించి ఉద‌య్ సింహ ఐటీ అధికారుల‌ను అడిగితే…తాము ఎలాంటి సోదాలు జ‌ర‌ప‌లేద‌ని చెప్పి షాక్ అయ్యార‌ట‌. దీని పై ఉద‌య్ సింహ స్పందిస్తూ… దీనికి ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హిస్తుందా..?  లేదా..ఐటీ అధికారులు బాధ్య‌త వ‌హిస్తారా..?  అని ప్ర‌శ్నించారు. రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మే ఈ దాడులు అని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here