Home Political News రాజ‌కీయ పార్టీలు అభ్య‌ర్ధుల‌కు ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!

రాజ‌కీయ పార్టీలు అభ్య‌ర్ధుల‌కు ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!

101
0

సాధార‌ణ నియ‌మాలు

1) అభ్య‌ర్ధి కానీ పార్టీ కానీ కుల మ‌త భాషా విద్వేషాలు రెచ్చ‌గొట్ట‌కూడ‌దు

2) విధానాలు, పొగ్రామ్ ల పైనే విమ‌ర్శ‌లు ఉండాలి. గ‌తంలో చేసిన ప‌ని రికార్డు పై ఉండాలి. వ్య‌క్తిగ‌త జీవితం పై విమ‌ర్శ‌లు ఉండ‌కూడ‌దు.

3) కుల మ‌త ప్రాతిప‌దిక పై ఓట్లు అడ‌గ‌కూడ‌దు. మందిరాలు, మ‌సీదులు, చ‌ర్చిలు ఇత‌ర ప్రార్ధ‌నా ప్ర‌దేశాల‌ను ఎన్నిక‌ల ప్ర‌చారం కొర‌కు వాడ‌రాదు.

4) ఓటు కొర‌కు డ‌బ్బు ఇవ్వ‌డం..బెదిరించ‌డం నిషేధం. ఒక వ్య‌క్తి ఓటును మ‌రొక వ్య‌క్తి వేయ‌డం చ‌ట్ట వ్య‌తిరేకం.

5) వ్య‌క్తుల అనుమ‌తి లేకుండా వాళ్ల భూమిని, బిల్డింగుల‌ను ప్ర‌చారానికి ఉప‌యోగించ‌రాదు.

6) ఇత‌ర పార్టీల ఎన్నిక‌ల ప్రచారాన్ని మీటింగుల‌ను ఆటంక‌ప‌ర‌చ‌రాదు.

స‌మావేశాలు (మీటింగ్ లు)

1) మీటింగ్ ల‌కు లిఖిత‌పూర్వ‌కంగా ముందుగానే పోలీసుల నుంచి అనుమ‌తి తీసుకోవాలి

2) నిషేదాజ్ఞ‌లు ..ఆంక్ష‌లు ఉన్న ప్ర‌దేశాల వివ‌రాలు తెలుసుకుని ఆ ప్ర‌దేశాల‌లో మీటింగ్స్ పెట్ట‌కూడ‌దు.

3) మీటింగ్ లో మైకు మ‌రియు లౌడ్ స్పీక‌ర్ల వినియోగానికి ముందుగా అనుమ‌తి తీసుకోవాలి.

4) సమావేశానికి ఎవ‌రైనా ఆటంకం క‌లిగిస్తే..పోలీసుల‌కు ఫిర్యాదు చేయాలి. పార్టీగా వారిపై చ‌ర్య‌లు తీసుకోకూడ‌దు.

ఊరేగింపులు

1) ఊరేగింపు రూటును ముందుగానే పోలీసుల‌కు తెలియ‌చేయాలి.

2) ఊరేగింపు రూటులో ఏమైనా నిషేధాజ్ఞ‌లు ఉన్నాయో ముందుగా తెలుసుకోవాలి

3) ట్రాఫిక్ కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా ఊరేగింపు ఉండాలి

4) ఎవ‌రి దిష్టిబొమ్మ‌లు త‌గ‌ల పెట్ట‌రాదు

పోలింగ్ తేదీ రోజు

1) శాంతియుతంగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఎల‌క్ష‌న్ అధికారుల‌కు స‌హ‌క‌రించాలి

2) ఎల‌క్ష‌న్ స్లిప్పుల పై ఓట‌రు చిట్టీ పై పార్టీ ఎన్నిక‌ల గుర్తు పార్టీ మ‌రియు అభ్య‌ర్ధి పేరు ఉండ‌కూడ‌దు

3) పోలింగ్ స‌మ‌యానికి 48 గంట‌ల ముందు మ‌ద్యం అమ్మ‌కాలు ఉండ‌కూడ‌దు

4) ఎన్నిక‌ల అధికారులు ధృవీక‌రించిన పాస్ లేకుండా పోలీంగ్ బూత్ లోకి ఎవ‌రు కూడా ప్ర‌వేశించ‌రాదు

5) ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఫిర్యాదుల‌ను ఎన్నిక‌ల ప‌రిశీల‌కుల‌కు చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here