Home Movie News రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ ప్రారంభం..!

రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ ప్రారంభం..!

102
0

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి…యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో రూపొందిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఈరోజు ప్రారంభ‌మైంది. భారీ చిత్రాల నిర్మాత డీవీవీ దాన‌య్య ఈ సంచ‌ల‌న చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ రోజు ప్రారంభ‌మైన ఫ‌స్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ల పై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళితో సినిమా చేయ‌డానికి బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఇంట్ర‌స్ట్ చూపించిన‌ప్ప‌టికీ రాజ‌మౌళి మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోలతోనే సినిమా చేస్తుండ‌డం విశేషం.

సుమారు 200 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందుతోన్న ఈ చిత్రానికి స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో న‌టించే హీరోయిన్స్ ఎవ‌ర‌నేది ఇంకా ఖ‌రారు కాలేదు. 2020లో ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి…బాహుబ‌లితో దేశ‌విదేశాల్లో సంచ‌ల‌నం సృష్టించిన రాజ‌మౌళి ఈ సినిమాతో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here