Home Actor రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్..లేటెస్ట్ అప్ డేట్..?

రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్..లేటెస్ట్ అప్ డేట్..?

56
0


ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. డి.వి.వి ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై దాన‌య్య ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్ చ‌రిత్ర ఆధారంగా రాజ‌మౌళి ఈ సినిమాని తెర‌కెక్కిస్తుండ‌డంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాని తెర పై చూస్తామా అనే ఆస‌క్తి ఏర్ప‌డింది.

ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే…ఈ నెలాఖ‌రు నుంచి అహ్మాదాబాద్, పూణెలో 30 రోజుల షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ కు జోడిగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా డైసీ ఎడ్గ‌ర్ జోన్స్ నటిస్తున్నారు. హీరోయిన్స్ ఇద్ద‌రు ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతార‌ని స‌మాచారం. దాదాపు  400 కోట్ల బ‌డ్జెట్ తో హై టెక్నీక‌ల్ వేల్యూస్ తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ సినిమాని దాన‌య్య నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ‌గ‌న్, త‌మిళ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఈ సంచ‌ల‌న చిత్రాన్ని 2020 జులై 30న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, మ‌ల‌యాళం, త‌మిళ్ లో రిలీజ్ చేస్తున్నారు.  ఇవే కాకుండా వేరే భాష‌ల నుంచి కూడా డిమాండ్స్ వ‌స్తుండ‌డంతో 10 ఇండియ‌న్ లాంగ్వేజ‌స్ లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here