Home Telugu రామ్ చ‌ర‌ణ్ – బోయ‌పాటి మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

రామ్ చ‌ర‌ణ్ – బోయ‌పాటి మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

119
0
Ramcharan-Boyapati movie

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. చ‌ర‌ణ్ స‌ర‌స‌న కైరా అద్వానీ న‌టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై దాన‌య్య నిర్మిస్తున్నారు. బోయపాటి సినిమా అంటే.. యాక్ష‌న్ ఏరేంజ్ లో ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌సరం లేదు.

ఇక ఇంట‌ర్వెల్ బ్యాంగ్ అయితే…ఓ రేంజ్ లో ఉంటుంది. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమాలో కూడా ఇంట‌ర్వెల్ బ్యాంగ్ అదిరింది అనేలా ఉంటుంద‌ట‌. అద్భుత‌మైన ట్విస్ట్ ల‌తో ఈ సినిమాకే హైలెట్ గా నిలిచేలా ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఈరోజు నుంచి తాజా షెడ్యూల్ ను హైద‌రాబాద్ లో ప్లాన్ చేసారు. ఈ షెడ్యూల్ ప‌ది రోజులు పాటు ఉంటుంది. ఈ షెడ్యూల్ లో ముఖ్య‌తారాగ‌ణం పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించనున్నారు.

ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఏంటంటే…ఈ మూవీ ఫస్ట్ లుక్ & టైటిల్ ను ఆగ‌ష్టు 15న రిలీజ్ చేయ‌నున్నారు. ఇక ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారని స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here