Home Actor రామ్ పోతినేని కాదు.. రామ్‌ చిరుత‌పులి – పూరి జ‌గ‌న్నాథ్.

రామ్ పోతినేని కాదు.. రామ్‌ చిరుత‌పులి – పూరి జ‌గ‌న్నాథ్.

142
0
రామ్ పోతినేని కాదు.. రామ్‌ చిరుత‌పులి - పూరి జ‌గ‌న్నాథ్. spiceandhra

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ – డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్. ఈ చిత్రంలో రామ్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ న‌టించారు. పూరి – ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం ఈ నెల 18న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఇస్మార్ట్ శంక‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వ‌రంగ‌ల్ లో గ్రాండ్ గా నిర్వ‌హించారు.

ఈ వేడుక‌లో డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ… “హైద‌రాబాద్ ఇస్మార్ట్ రౌడీకి పోలీసోళ్లు డిప్ప‌లో బొక్క‌బెట్టి, చిప్ప‌లోకి సిమ్‌కార్డ్ పెట్టిండ్రు`అదెందుకు పెట్టారు? పెట్టిన త‌ర్వాత ఏమైంద‌నేదే స్టోరీ. చాలా ఎంట‌ర్‌టైనింగ్ స్టోరీ. రామ్‌నే ఈ సినిమాకు హైలైట్‌.  టెంప‌ర్ సినిమా త‌ర్వాత నేను తీసిన సినిమాలు స‌రిగా ఆడ‌లేదు.  స‌రైన స‌క్స‌స్ కోసం విప‌రీత‌మైన ఆక‌లితో ఉంటే నాకు రామ్ దొరికాడు. వెజిటేరియ‌న్ ముసుగులో ఉన్న నాన్ వెజిటేరియ‌న్ కుర్రాడు రామ్‌. నేను త‌న‌నేం మార్చ‌లేదు. త‌న‌లో ఉండే గుణం అదే. త‌ను రామ్ పోతినేని కాదు.. రామ్‌ చిరుత‌పులి.

సినిమా త‌ప్ప మ‌రోటి ఉండ‌దు. ఇళ్లు త‌ర్వాత షూటింగే. ప్ర‌తిషాట్‌ను వంద‌శాతం మ‌న‌సుపెట్టి చేస్తాడు. త‌న‌కు హ్యాట్సాఫ్‌. మ‌ణిశ‌ర్మ గారు ఐదు మంచి పాట‌ల‌ను ఇచ్చారు. అన్ని పాట‌లు పెద్ద హిట్ అయ్యాయి. బోనాలు టైమ్‌లోనే మా సినిమా రిలీజ్ కావ‌డం.. అందులో బోనాలు సాంగ్ ఉండ‌టం యాదృచ్చికం. నిధి అగ‌ర్వాల్ చాలా హాట్‌. న‌భా చాలా మంచి రోల్ చేసింది. ఛార్మి ప్లానింగ్ బావుంటుంది. ఏ రోజూ ఏ ఇబ్బందీ లేకుండా షూటింగ్ పూర్తి చేశాం. ఆ క్రెడిట్ అంతా ఛార్మికే ద‌క్కుతుంది. స‌త్య‌దేవ్ చాలా ఇంపార్టెంట్ రోల్ చేశాడు. ప్రేక్ష‌కుల ఆశీర్వాదంతో ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి.. డ‌బుల్ ఇస్మార్ట్ సినిమా తీయాలి. అంత‌కు మించి కోరిక‌లేం లేవు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here