Home News రాయలసీమ అంటే లక్ష కోట్లు తినే నాయకులేనా?

రాయలసీమ అంటే లక్ష కోట్లు తినే నాయకులేనా?

63
0

ఎన్నిక‌ల సీజ‌న్ ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో అధికార ప‌క్షం, ప్ర‌తిప‌క్షం పోటాపోటీగా ప్ర‌జ‌ల‌పై వ‌రాల జ‌ల్లులు కురిపిస్తున్నాయి. జేబులో ల‌క్ష రూపాయ‌లు ఉంటే రూ. 5 ల‌క్ష‌లు విలువ చేసే హామీలు గుప్పిస్తున్నారు. జ‌న‌సేన పార్టీ ద‌గ్గ‌ర వేల కోట్ల‌ సంప‌ద లేదు. హెరిటేజ్ వంటి వ్యాపారాలు లేవు. కానీ ఏడుకొండ‌వాడి సాక్షిగా, పీర్ బాబా సాక్షిగా చెబుతున్నా రాయ‌ల‌సీమ‌ను ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని విధంగా అభివృద్ది ప‌రిచి చూపిస్తా అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పారు.  జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌స్తే వ్య‌వ‌సాయ అధారిత ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పి వేల మంది యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పిస్తాం. వెన‌క‌బ‌డిన ముస్లింలకు ఆర్ధిక ఆస‌రా క‌ల్పించ‌డంతోపాటు ముస్లిం మ‌హిళ‌ల ఆర్థిక  అభివృద్ధికి  ప్ర‌త్యేక ప‌థకాలు తీసుకొస్తాం. ప్ర‌తి ఒక్క చిన్న, స‌న్న‌కారు రైతుల పొలానికి నీరందేలా ఇరిగేష‌న్ ప్రాజెక్టు నిర్మించి, వ్య‌వ‌సాయాన్ని పండ‌గ చేస్తాం.


 అలాగే చిత్తూరు కేంద్రంగా ఐటి హ‌బ్ నిర్మించి వేలాది యువ‌త‌కు ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తాం. ఫ్లోరిక‌ల్చ‌ర్ , అగ్రిక‌ల్చ‌ర్ లో కొత్త విధానాలు అవ‌లంబించి నిరుద్యోగుల వ‌ల‌స‌లు నియంత్రిస్తాం. అలాగే జిల్లాలోని ధార్మిక కేంద్రాలు అన్ని క‌లుపుకుని టెంపుల్ టూరిజం అభివృద్ది చేస్తాం. నాణ్య‌మైన ఉచిత విద్య‌, వైద్యం అందిస్తాం. ప్ర‌తి ఒక్క‌రికి రూ. 10 ల‌క్ష‌ల భీమా చేయిస్తాం. స‌హ‌కార సంఘంలో ప‌నిచేసిన అన్ని ప‌రిశ్ర‌మ‌లు తెరిపించ‌డంతోపాటు రోడ్డు విస్త‌ర‌ణ‌లో న‌ష్ట‌పోయిన ప్ర‌తి ఒక్క‌రికి న‌ష్ట ప‌రిహారం అందేలా చూస్తామ‌ని హామీ ఇచ్చారు. అలాగే రాయ‌ల‌సీమ‌కు హైకోర్టు బెంచ్ కావాల‌ని డిమాండ్ ఉంది. దీని పై చ‌ర్చించి ఈ ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్య‌త తీసుకుంటాం. నిజాయితీగా ఆచ‌రించ‌గ‌లిగే మ్యానిఫెస్టోనే జ‌న‌సేన తీసుకొస్తుంది. రాయ‌ల‌సీమ అంటే ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్ష‌కోట్లు తినే నాయ‌కులు మాత్ర‌మే క‌నిపించారు .. ఇక మీద‌ట‌ ల‌క్ష ఉద్యోగాలు ఇచ్చే నాయ‌కులు క‌నిపిస్తార‌”ని స్ప‌ష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here