Home Uncategorized రాయలసీమ గడ్డ జనసేన అడ్డా అనిపిద్దాం. తెలుగుదేశం కుంభస్థలం కొడదాం – ప‌వ‌న్ క‌ళ్యాణ్

రాయలసీమ గడ్డ జనసేన అడ్డా అనిపిద్దాం. తెలుగుదేశం కుంభస్థలం కొడదాం – ప‌వ‌న్ క‌ళ్యాణ్

130
0

అనంతపురంలో రాయలసీమ కరవుపై యుద్ధం ప్రకటిస్తూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్  కవాతు చేశారు. జనసేన నేత శ్రీ నాదెండ్ల మనోహర్ ఈ కవాతులో నడిచారు. గుత్తి రోడ్డులోని మార్కెట్ యార్డ్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకూ మూడు కి.మీ. మేర సాగిన ఈ కవాతులో లక్షలాదిగా జనసేన కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కవాతు అనంతరం సప్తగిరి సర్కిల్ లో బహిరంగ సభ నిర్వహించారు.

ఈ వేదిక నుంచి శ్రీ పవన్ కళ్యాణ్  ప్రసంగిస్తూ…నేను విదేశాలకి వెళ్ళినప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలిసి ఆంధ్ర ప్రదేశ్ లో, ముఖ్యంగా కరవు ఉన్న రాయలసీమలో పరిశ్రమలు స్థాపించమని కోరాను. ఇక్కడి అవినీతికి వాళ్ళు భయపడ్డారు. పరిశ్రమ స్థాపించాలంటే ప్రతిపక్ష నేతకీ, ముఖ్యమంత్రి గారి కొడుకుకి వాటాలు ఇవ్వాలి.. ఎన్నో అడ్డంకులు ఉన్నాయి అని చెప్పారు. నాతో చాలామంది విదేశీ పారిశ్రామికవేత్తలు చెప్పారు, జగన్  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు, టీడీపీ అసలే రాదు, వచ్చేది జనసేన ప్రభుత్వం కాబట్టి మేము పెట్టుబడులు పెడతాం అని.  జనసేన ప్రభుత్వం వందలాది పరిశ్రమలు తీసుకు వస్తుంది. జనసేన అధికారంలోకి వస్తే మా నిజాయితీ చూసి కంపెనీలే ఇక్కడ పెట్టుబడుల కోసం వస్తాయి. లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండవు కాబట్టి జనసేన ప్రభుత్వం వచ్చాక పెట్టుబడులు పెట్టి యువతకు ఉపాధి కల్పిస్తాం అనిపారిశ్రామిక వేత్తలు చెప్పారు, అది వారికి జనసేన పట్ల ఉన్న నమ్మకం

జేసీ ప్రభాకర్ రెడ్డి గారు…మీ దాష్టికాలు అన్నీ చూస్తున్నాము, మీరు మార్చుకోవాలి, మీరు రౌడీల్లాగా రోడ్లమీదకు వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే సహించం, ఇది ఊరుకునే తరం కాదు ప్రభాకర్ రెడ్డి గారు. ఎవరికీ భయపడాలిసిన పని లేదు, మీ కష్టాలపై పోరాడేందుకు, అవసరమైతే ప్రాణ త్యాగం చేయడానికి నేను ఉన్నాను. దేశంలో జరుగుతున్న అన్యాయంపై రాళ్లయినా అరుస్తున్నాయి గాని, గులకరాళ్ల లాంటి యువత మాత్రం మాట్లాడడం లేదు,అన్నా మాకు ఉపాధి లేదు, మాకు ఎవరూ అండగా నిలబడట్లేదు అని అంటున్నారు, మీ విషయంలో జరుగుతున్న అన్యాయంపై పోరాడటానికి మీ అండ కావాలి.

* ఊర పిచ్చుక పై తాటిపండు

ముఖ్యమంత్రి గారు మా పాలనలో అవినీతి ఎక్కడ జరుగుతుంది అని అంటారు. సరే అని నేను సాక్ష్యాలు బయటపెడితే దానిమీద మాత్రం మాట్లాడరు. లోకేష్ వెన్న ముద్ద నోట్లోపెడితే మింగలేరు, వేలుపెడితే కొరకలేరు అన్నట్టు చెబుతారు. పుత్ర ప్రేమతో ముఖ్యమంత్రి గారు దృతరాష్ట్రుడిగా మారారు. ఇసుక, మట్టి మాఫియాలో తినేస్తున్న దాని గురించి మాట్లాడరు.ఊర పిచ్చుక మీద తాటిపండు పెడితే ఏమి చేయగలదు.. అలాగే ఏమాత్రం అనుభవం లేని, కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ గా గెలవని లోకేష్ కి పంచాయతీ రాజ్ శాఖ ఇస్తే ఏం చేస్తారు. ప్రతిపక్ష నేత జగన్ గారు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, అసెంబ్లీ నుంచి పారిపోయి పాదయాత్రలు చేస్తున్నారు.

అధికార పక్షం ఆగడాలపై పాలకుల్ని నిలదీసి ప్రజలకు అండగా నిలవాల్సిన జగన్ ఒక ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారు. ప్రధాని మోడీ అంటే జగన్ కీ, చంద్రబాబుకే భయం. లోకేష్ కైతే మరీ భయం. ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే భయం లేదు. ఏమి చేశామని భయపడాలి. కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడే వారికి భయపడకుండా కాంగ్రెస్ హఠావో అన్నవాడిని. బీజేపీని మొదట విమర్శించింది నేనే.  బీజేపీ అండతో తప్పించుకోవచ్చు అని జగన్ అనుకొంటున్నారు. పాత దొంగ అయినా ఎప్పుడో ఒకప్పుడు దొరక్కపోడు. లాలూ ప్రసాద్ యాదవ్ దొరకలేదా. ఈడీ కేసులున్న జగన్ తప్పించుకోగలరా? మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి నోరు ఎక్కువైంది. ఆయన చేసిన దోపిడీలకు విజయనగరం ప్రజలు తరిమికొట్టారు. బొత్స  విషయం విజయనగరంలోని తెలుస్తాను.

రాయలసీమ గడ్డ జనసేన అడ్డా అనిపిద్దాం. తెలుగుదేశం కుంభస్థలం కొడదాం. 2019 లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. టిడిపిని గద్దె దింపకపోతే మాది జనసేన పార్టీనే కాదు. 2019 లో మనం ఖచ్చితంగా రాజకీయ మార్పు తీసుకొస్తున్నాం, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం, ఈ దోపిడీ నాయకులను తరిమికొడుతున్నాం. రాయలసీమ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తాను. పోలీసు శాఖలోతీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చలు జరుపుతున్నాం, జనసేన అధికారంలోకి వస్తే మీ పని సమయాన్ని తగ్గిస్తాం, మీ వేతనాలను పెంచుతాం, ఒక పోలీసు కానిస్టేబుల్ కుమారుడిగా మీకు మాట ఇస్తున్నాను” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here