Home Actor రారా.. జ‌గ‌తిని జ‌యించుదాం.. గ్యాంగ్ లీడ‌ర్ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్.!

రారా.. జ‌గ‌తిని జ‌యించుదాం.. గ్యాంగ్ లీడ‌ర్ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్.!

93
0
రారా..జ‌గ‌తిని జ‌యించుదాం.. గ్యాంగ్ లీడ‌ర్ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్.! spiceandhra

నేచురల్‌ స్టార్‌ నాని వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం గ్యాంగ్ లీడ‌ర్.  మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల తర్వాత భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌ సాంగ్‌ను విడుదల చేశారు.

‘రారా.. జగతిని జయించుదాం…’

అనంత శ్రీరామ్‌ రచించిన ‘రారా.. జగతిని జయించుదాం.. రారా చరితని లిఖించుదాం..’ అంటూ సాగే పాటను అనిరుధ్‌ రవిచందర్‌ సంగీత నేతృత్వంలో పృథ్వీచంద్ర, బాషెర్‌మాక్స్‌ ఆలపించారు. ఈ పాటలోని ర్యాప్‌ను కూడా బాషెర్‌మాక్స్‌ క్రియేట్‌ చేశారు. చక్కని పదాలతో అనంతశ్రీరామ్‌ రాసిన ఈ పాట అందర్నీ ఇన్‌స్పైర్‌ చేసేలా ఉంది. దానికి తగ్గట్టుగానే సింగర్స్‌ ఇద్దరూ అద్భుతంగా ఆలపించారు. అనిరుధ్‌ మ్యూజిక్‌ మెస్మరైజ్‌ చేసేలా ఉంది.

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, డార్లింగ్‌ స్వామి, రచనా సహకారం: ముకుంద్‌ పాండే, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here