Home Political News రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి కేసీఆర్ కుటుంబం మాత్రం ఆస్తుల‌ను పెంచుకుంది.  – రాహుల్ గాంధీ

రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి కేసీఆర్ కుటుంబం మాత్రం ఆస్తుల‌ను పెంచుకుంది.  – రాహుల్ గాంధీ

107
0

గద్వాల జిల్లాలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహల్ గాంధీ మాట్లాడుతూ….ఐదేళ్ల క్రితం తెలంగాణ ప్ర‌జ‌లు క‌ల‌క‌న్నారు. నీళ్లు నిధులు, నియామ‌కాలు గురించి క‌ల క‌న్నారు. బంగారు తెలంగాణ గురించి క‌ల క‌న్నారు. అయితే.. కేసీఆర్ సీఎం అయ్యాకా కుటుంబ పాలన సాగుతోంది అంటూ మండిప‌డ్డారు. నీళ్లు, ఉద్యోగాలు నిధుల విష‌యంలో కేసీఆర్ మోసం చేసారు. పాల‌మూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల అవ‌స‌రాన్ని గుర్తించింది కాంగ్రెస్సే అని గుర్తుచేసారు. 10 వేల కోట్ల ప్రాజెక్ట్ ను 60 వేల కోట్ల‌కు పెంచారు. వేల కోట్ల‌ను కాంట్ర‌క్టులు దోచుకుంటున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే.. రెండు ద‌శ‌ల్లో ప్రాజెక్టుల‌ను పూర్తి చేసి రంగారెడ్డి, న‌ల్గొండ‌కు నీళ్లు ఇస్తాం అని చెప్పారు. కేసీఆర్ అంటే ఖావో క‌మీష‌న్ రావు అని… కేసీఆర్ క‌మీష‌న్లు మాత్ర‌మే మేస్తున్నారంటూ రాహుల్ చ‌మ‌త్క‌రించారు. నాలుగున్న‌రేళ్ల‌లో ల‌క్ష‌న్న‌ర కోట్లు అప్పు చేసారు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి కేసీఆర్ కుటుంబం మాత్రం ఆస్తుల‌ను పెంచుకుంది అన్నారు. రాష్ట్రంలో 30 ల‌క్ష‌ల మంది యువ‌త‌కు ఉద్యోగాలు లేవు.తెలంగాణ‌లో ఒక్క కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయ్యిందని… తెలంగాణ‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరుగుతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాకా రైతుల అప్పులు మాఫీ చేస్తామ‌ని చెప్పారు. తెలంగాణ ప్రజలకు 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామన్న కేసీఆర్ కనీసం ఐదు వేల ఇళ్లను కూడా పూర్తి చేయలేకపోయారన్నారు. సామాన్య ప్రజలు ఇల్లు లేకుండా అల్లాడుతుంటే కేసీఆర్ మాత్రం రూ.300 కోట్ల విలువైన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు అందజేస్తామని.. నిరుద్యోగ యువతీయువకులకు రూ.3 వేలు జీవన భృతిని అందజేస్తామని తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here