Home News రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ లోక్ సభ స్థానానికి పోటీ చేయనున్నారా? ఆ...

రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ లోక్ సభ స్థానానికి పోటీ చేయనున్నారా? ఆ మేరకు ఆయన సన్నిహిత ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారా??

89
0

తాజా పరిణామాలను పరిశీలిస్తే గంటాకు అసెంబ్లీకి మాత్రమే పోటీ చేయాలని ఉంది. కానీ… ఆయనకు ఒకప్పటి సన్నిహిత మిత్రుడు అవంతి శ్రీనివాస్ భీమిలి నియోజకవర్గానికి వైసిపి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. దీంతో అక్కడ గంటకు బలమైన ప్రత్యర్థి నిలబడినట్లు అయింది.  పైగా  గంటా శ్రీనివాసరావు  వ్యూహాలు ఎలా ఉంటాయో అవంతికి  బాగా తెలుసు. ఇప్పటికే  ఈయన భీమిలి నియోజకవర్గంలోని గంటా శ్రీనివాసరావు అనుచరులను వ్యక్తిగతంగా కలుస్తున్నారు.  తనకు  మద్దతివ్వాలని కోరుతున్నారు. అవంతికి వ్యక్తిగత అనుచరగణం భారీగా ఉంది. సామాన్యులతో కలిసిపోగల చాణక్యం ఉంది. ఈ విషయంలో గంటా శ్రీనివాసరావు ఆయన ముందు  దిగదుడుపే.

ఈ పరిణామాలను గమనించిన విశాఖలోని మిగిలిన ఎమ్మెల్యేలు గంటాను లోక్ సభ బరిలోకి దింపాలని ప్రతిపాదిస్తున్నారు.  పార్టీ నాయకత్వం ముందు ఈ ప్రతిపాదన ఉంచారు. తాజాగా గంటాతో సమావేశమైన ఎమ్మెల్యేలు తమ ప్రతిపాదనలు ఆయనకు వివరించారు.  ఎందుకంటే  గంటా శ్రీనివాసరావు లోక్ సభకు పోటీ చేస్తే అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమకు బలమైన సపోర్టు లభిస్తుందని  ఎమ్మెల్యేల ఆశ. కానీ ఈ ప్రతిపాదనను గంటా శ్రీనివాసరావు వ్యతిరేకించారు. తాను మాత్రం తప్పనిసరిగా అసెంబ్లీకే  పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే… విశాఖ లోక్ సభ స్థానానికి పోటీ చేయడానికి టీడీపీలో ఇప్పటివరకు బలమైన లేరు. అందువలన పార్టీ నాయకత్వం ఆదేశిస్తే గంటకు పోటీ చేయక తప్పని పరిస్థితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here