Home News రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలోనే ఉండక తప్ప...

రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలోనే ఉండక తప్ప నీ పరిస్థితి ఏర్పడిందా? అటు వైసీపీ ఇటు జనసేన తలుపులు మూసేసాయా?

75
0

గంటా శ్రీనివాసరావు అనుసరించే వ్యూహాత్మక  అడుగుల పై రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ  ఆసక్తికర చర్చ  నడుస్తుంటుంది.   ఈసారి కూడా ఆయన వైసీపీలోకి వెళ్లిపోతున్నారని ఓసారి కాదు జనసేనలో   చేరతారని ప్రచారం ముమ్మరంగా జరిగింది.  గతంలో విజయసాయిరెడ్డి సైతం గంటా పై కామెంట్ చేశారు.  మంత్రి వైసీపీలోకి రావటానికి ప్రయత్నం చేస్తున్నారని,  గంటా లాంటి వ్యక్తిని  నమ్మేది లేదని ఆయనను పార్టీలో తీర్చుకునేది లేదని కుండ బద్దలు కొట్టారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం మాట్లాడుతూ పార్టీలోకి ఎవరినైనా చేర్చుకుంటాగాని గంటాను మాత్రం రానివ్వబోమని స్పష్టం చేశారు.

ఇటీవల మంత్రికి మిత్రుడు అవంతి శ్రీనివాస్ వైసీపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.  దీని వెనుక గంటా శ్రీనివాసరావు  ప్లానింగ్ ఉందని ఓ ప్రచారం  జరిగింది.  టిడిపి నాయకత్వం వ్యూహాత్మకంగా  వ్యవహరించి అవంతి పై మాటల దాడి చేయడానికి గంటాను ప్రయోగించింది. అనుకున్నట్టే అవంతి మంత్రి గంటా పై విరుచుకుపడ్డారు.   ఇది వీరిద్దరి మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోసింది.

కానీ వారిద్దరి సన్నిహిత వర్గాల నుంచి  అందిన సమాచారం వేరేగా ఉంది  . ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా మెలగిన   వారి మధ్య ఆర్థిక వ్యవహారాల విషయంలో   తేడా వచ్చిందని, అది విభేదాలకు దారితీసిందని ఒక వాదన. గత ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని అవంతి శ్రీనివాస్ ప్రయత్నించినప్పుడు  గంటా శ్రీనివాసరావు అడ్డుకుని అనకాపల్లి లోక్సభకు పోటీ చేసేలా చేశారని ఇది  తీవ్ర అసంతృప్తికి కారణమయిందని మరో వాదన.  ఈ నేపథ్యంలోనే ఈసారి స్థితిలోనూ పార్టీ ఏదైనా సరే భీమిలి నుంచి పోటీ చేయాలని అవంతి నిర్ణయించుకోవటం దీనికి గంటా నుంచి సపోర్ట్ లభించకపోవటం పైగా  అక్కడినుంచి పోటీ చేస్తానని మంత్రి ప్రకటించడం వారిద్దరి మధ్య  విభేదాలను  ముదిరేలా చేసిందని ప్రచారం జరిగింది.

ఏది ఏమైనా గంటా శ్రీనివాసరావు పార్టీ మారడం ఖాయమని గట్టి ప్రచారమే జరిగింది దీనిని ఆయన సకాలంలో ఖండించకపోవడం, ఇంతవరకు ఆయన రాజకీయ ప్రయాణం అనుమానాల ను మరింత బలపడేలా చేశాయి.  వైసిపి, జనసేన తలుపులు మూసేయడంతో గంటా శ్రీనివాసరావుకు వేరే మార్గం లేకుండా పోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో    తెలుగుదేశం పార్టీలోనే   కొనసాగాల్సి వచ్చింది.

  ఈ నేపథ్యంలోనే ఆయన తను బతికినంత కాలం తెలుగు దేశం లోనే ఉంటానని, మరి ఏ పార్టీలోకి వెళ్లే ప్రసక్తి లేదని చెప్పుకోవాల్సి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here