Home Political News రాష్ట్ర విభ‌జ‌న‌కి కార‌ణం ఎస్ఈజెడ్‌లే – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

రాష్ట్ర విభ‌జ‌న‌కి కార‌ణం ఎస్ఈజెడ్‌లే – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

139
0

* అధికారంలోకి వ‌స్తే సెజ్ రైతుల‌పై కేసులు ఎత్తేస్తాం

* రైతు క‌న్నీరు దేశానికి క్షామం

* కాకినాడ ఎస్ఈజెడ్‌పై జ‌న‌సేన త‌రపున ప్రత్యేక క‌మిటీ

* సామ‌ర‌స్య పూర్వక ప‌రిష్కారానికి  క‌ట్టుబ‌డి ఉంటాం

* ఒక రోజు మొత్తం బాధిత గ్రామాల్లో ప‌ర్యటిస్తా

* కాకినాడ ఎస్ఈజెడ్ బాధితుల‌తో శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్

జ‌న‌సేన పార్టీ ప్ర‌భుత్వం వ‌స్తే కాకినాడ ఎస్ఈజెడ్ రైతుల‌పై పెట్టిన కేసులు ఎత్తివేస్తామ‌ని జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్  హామీ ఇచ్చారు. అందుకు సంబంధించి చ‌ట్ట‌ప‌ర‌మైన ఇబ్బందులు ఉన్నా అధిగ‌మిస్తామ‌న్నారు. మంగ‌ళ‌వారం కాకినాడ జీ.కన్వెన్ష‌న్ హాల్లో సెజ్ బాధితుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. గ‌త 13 సంవ‌త్స‌రాలుగా తాము ప‌డుతున్న ఇబ్బందుల‌ని సెజ్ బాధితులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్  ముందు ఉంచారు. రాత్రికి రాత్రి ఊళ్ళు ఖాళీ చేయించార‌నీ, సెజ్ కార‌ణంగా మా భూములు బీడు వారిపోతున్నాయి.. మా పిల్ల‌ల భ‌విష్య‌త్తు బీడు వారిపోతోంద‌ని వాపోయారు.

సెజ్ బాధితుల క‌న్నీటి గాధ‌లు విన్న అనంత‌రం శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్  మాట్లాడుతూ.. “కాకినాడ సెజ్ బాధితుల‌కి జ‌న‌సేన పార్టీ అండ‌గా ఉంటుంది. ఎస్ఈజెడ్‌ల ఏర్పాటుకి సంబంధించి నాకు స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉంది. ప‌రిశ్ర‌మ‌లు స్థాపించేందుకు భూములు తీసుకుంటే, ఓ నిర్ణీత గ‌డువులో వాటిని వినియోగించాలి. అలా చేయ‌లేన‌ప్పుడు ఎవ‌రి భూములు వారు తిరిగి తీసేసుకునే హ‌క్కు ఉంది. అయితే ఇక్క‌డ ప‌రిస్థితులు మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా ఉన్నాయి. అందుకు కార‌ణం మ‌న రాజ‌కీయ నాయ‌కులే.. ఎవ‌రైనా పారిశ్రామికవేత్త‌లు కంపెనీలు పెడ‌తామ‌ని ముందుకి వ‌స్తే, క‌మిష‌న్ ఎంతిస్తారు అని అడుగుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపి, మంత్రులు అంతా పారిశ్రామిక వేత్త‌ల‌ని దోచుకుంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితులు అన్నీ మారాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా.

కాకినాడ ఎస్ఈజెడ్ స‌మ‌స్య‌కి జ‌న‌సేన పార్టీ ఓ సామ‌ర‌స్య‌పూర్వ‌క ప‌రిష్కారం చూపుతుంది. నైతిక బ‌లం కోల్పోకుండా అంతా ఐక్యంగా పోరాటం చేద్దాం. రాజ్యాంగ ప‌రంగా ఇచ్చిన హ‌క్కుల సాధ‌న‌కి కృషి చేద్దాం. అంతా క‌ల‌సిక‌ట్టుగా పోరాటం చేస్తే, బ‌ల‌మైన ప‌రిష్కారం దొరుకుతుంది. రైతు క‌న్నీరు దేశానికి క్షేమం కాదు.. క్షామం. సెజ్‌ల వ‌ల్ల భూములు బంధాల్ని తెంపేస్తున్నాయి. ఇన్ని త్యాగాలు చేసిన రైతులు ఎందుకు రోడ్ల మీద ఉండాలి.?  రాజ్యాంగబ‌ద్దంగా, ప్ర‌జాస్వామ్యబ‌ద్దంగా మ‌న హ‌క్కులు సాధించుకుందాం. నేను ముఖ్య‌మంత్రి గారిలా ఏరువాక‌ల పేరుతో ఫొటోల‌కి పోజులివ్వ‌ను, జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి గారిలా బుగ్గలు నిమ‌ర‌ను.. బుగ్గ‌లు నిమిరితే  కేసులు పోవు. అవ‌స‌రం అయితే కేవీ రావుని పిలిపించి మాట్లాడుదాం, జిఎమ్మార్ ప్ర‌తినిధుల్ని పిలిపించి మాట్లాడుదాం.

ముందు ప్ర‌త్య‌ర్ధి ఏం చెబుతున్నాడో విందాం. ఓఎస్‌జీసీ రిఫైన‌రీ పేరుతో 10 వేల ఎక‌రాలు తీసుకుంది ఎవ‌రి కోసం.?  దీని వెనుక ఎవ‌రు ఉన్నారు.? ఎవ‌రెవ‌రు బినామీలు.?  రాజ‌కీయ నాయ‌కుల్లా నేను తీయ‌టి క‌బుర్లు చెప్పి దోచుకోవడానికి రాలేదు.రాజ‌కీయాల్లో ధ‌ర్మాన్ని నిల‌బెట్టేందుకు వ‌చ్చా. మీ అంద‌రి కోసం పోరాటం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నా. పొట్టి శ్రీరాములు గారి త్యాగాల‌ని వృధాగా పోనీయం. నేను ఓ సాధార‌ణ రైతునే. మ‌ట్టిశ‌క్తిని అర్ధం చేసుకున్న వాడిని. రాజ‌కీయ నాయ‌కుల ప‌రిస్థితి అలా లేదు. కులాల‌కి అతీతంగా, సెజ్ బాధితులంతా ఓ కులంగా క‌ల‌సి పోరాటం చేద్దాం. కేసులు పెట్టినా భ‌య‌ప‌డ‌కండి. మీకు జ‌న‌సేన పార్టీ అండ‌గా ఉంటుంది. ఓ రోజు మొత్తం సెజ్ బాధితుల‌కి కేటాయిస్తా. సాధ్య‌మైన‌న్ని గ్రామాల్లో ప‌ర్య‌టిస్తా. జ‌న‌సేన పార్టీ త‌రుపున ఓ ప్ర‌త్యేక క‌మిటీ వేస్తాన‌”ని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here