Home Actor రాహుల్ గాంధీ భార‌తీయుడా… కాదా.. డౌట్ వెలిబుచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం..!

రాహుల్ గాంధీ భార‌తీయుడా… కాదా.. డౌట్ వెలిబుచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం..!

86
0

కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ మ‌రో వివాదంలో ఇరుక్కొన్నారు. అస‌లు రాహుల్ గాంధీ భార‌తీయుడేనా కాదా అంటూ కేంద్ర ప్ర‌భుత్వం డౌట్ వెలిబుచ్చింది. అంతే కాదు ఈ డౌట్ కు వివ‌ర‌ణ ఇవ్వాలంటూ ఒక నోటీసు కూడా విడుద‌ల చేసింది. సరిగ్గా ఎన్నిక‌ల వేడిలో ఉన్న స‌మ‌యంలో వ‌చ్చిప‌డిన ఈ వివాదం రాహుల్ కు ఎంత డ్యామేజీ చేస్తుందో చెప్ప‌లేం కానీ బీజేపీ మాత్రం దీన్ని వాడుకొనేందుకు ప్ర‌య‌త్నించే అవ‌కాశం ఉంది.

అస‌లు విష‌యం ఏమిటంటే…బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ప్ర‌త్య‌ర్థుల మీద న్యాయ‌పోరాటం చేయ‌టంలో దిట్ట‌. గ‌తంలో అనేక మంది హేమాహేమీల‌ను కోర్టుల చుట్టూ తిప్పిన అనుభ‌వం ఉంది. ఆయ‌న గ‌తంలో ఒక వివాదాన్ని లేవనెత్తారు. రాహుల్ గాంధీ అస‌లు భార‌తీయుడే కాదని, బ్రిట‌న్ లో పౌర‌సత్వం ఉంద‌ని తేల్చి చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాల్ని కూడా బ‌య‌ట పెట్టారు.  అది మొదలు తరచూ రాహుల్‌పై ఇదే తరహా ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. కాగా 2016లో ఈ విషయమై రాహుల్ స్పందిస్తూ.. స్వామి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారనీ, ఆయన ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపాలని సవాల్ విసిరారు. దీంతో సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి త‌న దగ్గ‌ర ఉన్న ఆధారాల‌తో స‌హా కేంద్ర హోం శాఖ కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఇది తెర మీద‌కు వచ్చింది.

దీన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొన్న హోం శాఖ ఒక నోటీసు జారీ చేసింది.‘‘2003లో బ్రిటన్‌లో బ్యాకోప్స్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించారనీ…   సదరు కంపెనీకి రాహుల్ గాంధీ ఓ డైరెక్టర్‌గానూ, సెక్రటరీగానూ ఉన్నట్టు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి నుంచి మాకు ఫిర్యాదు అందింది…’’ అంటూ హోంశాఖలోని పౌరసత్వ వ్యవహారాల డైరెక్టర్ బీసీ జోషి ఈ నోటీసులో పేర్కొన్నారు.ఈ రికార్డుల ప్రకారం రాహుల్ గాంధీ పుట్టిన తేదీ 1970 జూన్ 10 గానూ,   బ్రిటీష్ పౌరుడిగానూ వెల్లడించినట్టు స్వామి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని మీద రెండు వారాల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కేంద్ర హోం శాఖ కోరింది. కాగా ఇదంతా రాజ‌కీయ కుట్ర అని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here