Home Telugu రెండు ఫ్లాపులు ఇచ్చిన హీరోతో మూవీ ప్లాన్ చేస్తోన్న‌ అశ్వ‌నీద‌త్..!

రెండు ఫ్లాపులు ఇచ్చిన హీరోతో మూవీ ప్లాన్ చేస్తోన్న‌ అశ్వ‌నీద‌త్..!

113
0

వైజ‌యంతీ మూవీస్ అధినేత అశ్వ‌నీద‌త్ అగ్ర హీరోలుతో భారీ చిత్రాలు నిర్మించి సంచ‌ల‌న విజ‌యాలు సాధించారు. అయితే…ఆ మ‌ధ్య సినిమాల నిర్మాణంలో కాస్త వెన‌క‌బ‌డిన అశ్వ‌నీద‌త్…మ‌హాన‌టి సినిమా ఇచ్చిన విజ‌యోత్సాహంతో వ‌రుస‌గా సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ కింగ్ నాగార్జున  – నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ నిర్మిస్తున్నారు. యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ చిత్రం ఆగ‌ష్టులో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.

ఈ సినిమా త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ భారీ సినిమాని నిర్మించ‌నున్నారు. వంశీ పైడిప‌ల్లి ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రాన్ని జూన్ లో ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది. ఇది మ‌హేష్ బాబుకి 25వ చిత్రం కావ‌డం విశేషం. ఈ సినిమా త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు అశ్వ‌నీద‌త్ ఇటీవ‌ల మీడియాకి తెలియ‌చేసారు.

ఎన్టీఆర్ ప్ర‌స్తుతం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించే భారీ మ‌ల్టీస్టార‌ర్ లో చ‌ర‌ణ్ తో క‌లిసి న‌టించ‌నున్నారు. జ‌క్క‌న్న త‌న సినిమా విష‌యంలో…ఎంత కేర్ తీసుకుంటారో..ఎంత టైమ్ తీసుకుంటారో తెలిసిందే. సో..ఎన్టీఆర్ తో అశ్వ‌నీద‌త్ సినిమా అంటే…టైమ్ ప‌డుతుంది. గ‌తంలో ఎన్టీఆర్ తో కంత్రి, శ‌క్తి చిత్రాల‌ను నిర్మించారు అశ్వ‌నీద‌త్. ఈ రెండు చిత్రాలు ఆడియ‌న్స్ ని ఆక‌ట్టుకోలేక‌పోయాయి. మ‌రి…ఎన్టీఆర్ తో చేసే మూడ‌వ ప్ర‌య‌త్నం అయినా స‌క్స‌స్ అవుతుందేమో చూద్దాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here