Home Political News రెండేళ్ల నుంచి వారి పై చ‌ర్య‌లు ఎందుకు తీసుకోలేదు – కాంగ్రెస్ నేత‌ ఉత్త‌మ్ కుమార్...

రెండేళ్ల నుంచి వారి పై చ‌ర్య‌లు ఎందుకు తీసుకోలేదు – కాంగ్రెస్ నేత‌ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.

91
0

కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ లో క‌లుపుతున్న‌ట్లు లేఖ ఇవ్వ‌డం దారుణం అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. మండ‌లి ఛైర్మ‌న్ స్వామిగౌడ్ ను కాంగ్రెస్ నేత‌లు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ష‌బ్బీర్ ఆలీ క‌లిసారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబ‌ట్టి విలీనానికి అవ‌కాశం లేద‌ని లేఖ ఇచ్చారు. నలుగురు ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖ‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌ద్ద‌ని విన‌తి ప‌త్రం అంద‌చేసారు. మండలి ఛైర్మన్ స్వామి గౌడతో భేటీ అనంత‌రం ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..లేఖ వెన‌క ఎవ‌రున్నారో తెలంగాణ ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌న్నారు.

తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్యం ఖూనీ అవుతుంది. ఆకుల ల‌లిత‌, సంతోష్ సీఎల్పీ మీటింగ్ పెట్టుకున్న‌ట్టు చెప్పారు. కాంగ్రెస్ లో లేనివాళ్లు సీఎల్పీ మీటింగ్ ఎలా పెడ‌తారు అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఆకుల ల‌లిత‌, సంతోష్ కు సీఎల్పీ మీటింగ్ పెట్టే అధికారం లేద‌న్నారు. ప్ర‌భాక‌ర్, దామోద‌ర్ రెడ్డి రెండేళ్ల క్రితం పార్టీ మారారు. రెండేళ్ల నుంచి వారి పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించారు. ఛైర్మన్ న్యాయ‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించి మండ‌లి ప్ర‌తిష్ట కాపాడాలి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here