Home Movie News రెచ్చిపోదాం బ్ర‌ద‌ర్ అంటున్న ఎఫ్ 2 బ్ర‌ద‌ర్స్..!

రెచ్చిపోదాం బ్ర‌ద‌ర్ అంటున్న ఎఫ్ 2 బ్ర‌ద‌ర్స్..!

93
0

విక్ట‌రీ వెంక‌టేష్ – మెగా హీరో వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్ లో స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తోన్నచిత్రం ఎఫ్ 2. వెంకీ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్ స‌ర‌స‌న మెహ్రీన్ న‌టిస్తున్నారు.  శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఈ అల్లుళ్లు గ‌ట్టిగానే న‌వ్వించేలా ఉన్నార‌నిపిస్తుంది.లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…రెచ్చిపోదాం బ్ర‌ద‌ర్ అంటూ ఒకే క‌ల‌ర్ సూటు – బూటులోఉన్న వెంకీ – వ‌రుణ్ ల పోస్ట‌ర్ రిలీజ్ చేసారు.

ఈ రోజు సాయంత్రం 5 గంట‌ల‌కు వీడియోక్లిప్ రిలీజ్ చేయ‌నున్నారు. రేపు (ఈ నెల 20) ఫుల్ వీడియో లిరిక‌ల్ సాంగ్ రిలీజ్చేయ‌నున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ప‌టాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్..చిత్రాల‌తో హ్యాట్రిక్సాధించిన అనిల్ రావిపూడి కామెడీని బాగా డీల్ చేస్తాడు. ఇక అత‌నికి వెంకీ – వ‌రుణ్తోడైతే ఆ సినిమాలో కామెడీ ఏరేంజ్ లో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. మ‌రి..ఈ తోడ‌ల్లుళ్లు వెంకీ – వ‌రుణ్ చేసే సంద‌డిఎలా ఉంటుందో చూడాలంటే సంక్రాంతి వ‌ర‌కు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here