Home Political News రేపు ఢిల్లీలో కీల‌క ప‌రిణామాలు.!

రేపు ఢిల్లీలో కీల‌క ప‌రిణామాలు.!

86
0

బీజేపీకి వ్య‌తిరేకంగా మిగిలిన పార్టీల‌న్నింటినీ ఒక తాటిపైకి తీసుకువ‌చ్చేందుకు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు. ఈ నేప‌ధ్యంలో రేపు ఢిల్లీలో చంద్ర‌బాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని క‌లిసే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఉద‌యం శ‌ర‌త్ ప‌వ‌ర్, ఫ‌రూక్ అబ్దుల్లాతో చంద్ర‌బాబు భేటీ కానున్నారు. మ‌ధ్యాహ్నం వామ‌ప‌క్ష నేత‌లు, సాయంత్రం అఖిలేష్ యాద‌వ్ తో చంద్ర‌బాబు భేటీ కానున్నారు. సేవ్ నేష‌న్ పేరుతో బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా జాతీయ స్ధాయిలో కూట‌మిని ఏర్పాటు చేసే యోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నారు. ఏపీకి అన్యాయం చేస్తోన్న బీజేపీ తీరును ఎండ‌గ‌ట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేవారితో క‌లిసి వెళ్లేందుకు టీడీపీ అడుగులు వేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here