Home News రేప‌టి త‌రం కోసం..మెరుగైన స‌మాజం కోసం.. జ‌న‌సేన‌కు ఓటేద్దాం.. నాదెండ్ల మ‌నోహ‌ర్ ని గెలిపిద్దాం.!

రేప‌టి త‌రం కోసం..మెరుగైన స‌మాజం కోసం.. జ‌న‌సేన‌కు ఓటేద్దాం.. నాదెండ్ల మ‌నోహ‌ర్ ని గెలిపిద్దాం.!

115
0


తెనాలి శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుండి జ‌న‌సేన పార్టీ త‌రుపున పోటీ చేస్తోన్న‌ నాదెండ్ల మ‌నోహ‌ర్ ప్ర‌త్య‌ర్ధుల కంటే స్పీడుగా ప్ర‌జ‌ల‌ను క‌లుస్తూ ప్ర‌చారంలో దూసుకెళుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెనాలి నియోక‌వ‌ర్గంలో ఆయ‌న చేసిన అభివృద్ధి ప‌నులు గురించి క్లుప్లంగా చెప్పాలంటే…గ్రామాల్లో సైతం ప్రాధ‌మిక ఆరోగ్య కేంద్రాల క‌ల్ప‌న దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టారు. రాష్ట్రంలోనే ప్ర‌ప్ర‌ధ‌మంగా మోడ‌ల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి పూర్తి చేసారు. అంత‌టితో ఆగ‌కుండా విద్యార్ధుల మ‌నో వికాసానికి మాన‌సిక ఉల్లాసానికి ఉప‌యోగ‌ప‌డేలా క్రీడా ప్రాంగ‌ణాల‌ను నిర్మించి విద్య‌తో పాటు క్రీడాల్లో రాణించడానికి కృషి చేసారు నాదెండ్ల మ‌నోహ‌ర్. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమం కోసం అనునిత్యం త‌పించే మ‌నోహ‌ర్ ఇందిర‌మ్మ ఇళ్లు, గ్యాస్ క‌నెక్ష‌న్లు, రేష‌న్ కార్డుల పంపిణీ వంటి ఎన్నో ప్ర‌జోప‌యోగ‌క‌ర ప్రాజెక్టులు చేప‌ట్టి విజ‌య‌వంతంగా పూర్తి చేసి బాస‌ట‌గా నిలిచారు.

రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం క్రియాశీల‌క రాజ‌కీయాల్లో కొంత మౌనం వ‌హించిన మ‌నోహ‌ర్..వ్య‌వ‌స్ధ‌ను ప్ర‌క్షాళించ‌డానికి క‌ళ్యాణ్ స్ధాపించిన జ‌న‌సేన పార్టీ విధి విధానాలు సిద్ధాంతాలు న‌చ్చి అదే భావ‌జాలంతో ఉన్న త‌న‌కి కూడా జ‌న‌సేనే జ‌న‌సేవ‌కు స‌రైన మార్గం అని త‌ల‌చి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జ‌న‌సేన‌లో చేరారు. కొద్ది స‌మ‌యంలోనే పార్టీలో ముఖ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకునే ఒక బ‌ల‌మైన నేత‌గా ఎదిగిన వైనం అభ్యుద‌య స‌మాజ నిర్మాణం ప‌ట్ల మ‌నోహ‌ర్ కు ఉన్న నిబ‌ద్ధ‌త‌కు జ‌న‌సేన అధినేత సైతం మ‌నోహ‌ర్ గురించి చెబుతూ త‌న‌కు పెద్ద‌న్న లాంటి వారు అని అన్నారంటే..మ‌నోహ‌ర్ ఎంత బ‌లంగా వెన్నుద‌న్నుగా నిల‌బ‌డుతున్నారో అన్న‌ది తేట‌తెల్లం అవుతుంది.

జాగోరే..జాగో, జ‌న‌సేన త‌రంగం లాంటి వివిధ కార్య‌క్ర‌మాల‌తో నిత్యం ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతూ ముందుకు దూసుకుపోతున్నారు. ధ‌వళేశ్వ‌రం క‌వాతు మొద‌లుకుని డ‌ల్లాసులో జ‌రిగిన ప్ర‌వాస‌గ‌ర్జ‌న వ‌ర‌కు అనునిత్యం ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెన్నంటే వుండి ప్రజా స‌మ‌స్య‌ల పై అలుపెర‌గ‌ని పోరాటం చేస్తోన్న ఒక శ‌క్తి నాదెండ్ల మ‌నోహ‌ర్. రెండు సార్లు శాస‌న‌స‌భ‌కు ఎన్నికైన వ్య‌క్తి. ఉన్న‌త రాజ్యాంగ ప‌ద‌వుల అధిరోహించిన వ్య‌క్తి. రేప‌టి త‌రం కోసం ఒక బ‌ల‌మైన మెరుగైన స‌మాజాన్ని నిర్మించాల‌నే త‌ప‌న ఉన్నమ‌నోహ‌ర్ రాబోతున్న ఎన్నిక‌ల్లో మ‌రొక్క‌సారి తెనాలి శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుండి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నారు. తెనాలిని అన్ని రంగాల్లో అగ్ర‌గామిగా నిలిపి అభివృద్ధిప‌ధంలో ప‌రుగులు పెట్టించిన బ‌ల‌మైన నాయ‌కుడు మ‌నోహ‌ర్ ని అత్య‌ధిక మెజార్టీతో గెలిపిద్దాం. రేప‌టి త‌రం బంగారు భ‌విత‌కు నేటి నుంచే జ‌న‌సేనతో బాట‌లు ప‌రుద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here