Home Political News రేవంత్ రెడ్డి పై కుట్ర‌లు – టీఆర్ఎస్ చేత‌కానిత‌నానికి నిద‌ర్శ‌నాలు – ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

రేవంత్ రెడ్డి పై కుట్ర‌లు – టీఆర్ఎస్ చేత‌కానిత‌నానికి నిద‌ర్శ‌నాలు – ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

115
0
dc-Cover-fj73uechdvgdtbcna4m6jop8e6-20180406011917.Medi

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేయడం పై కాంగ్రెస్ నేత‌లు స్పందిస్తూ..టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు.ఇది రాజ‌కీయ క‌క్ష‌సాధింపుగా టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అభివ‌ర్ణించారు. కేసీఆర్ కు ప్ర‌జ‌లే బుద్ధి చెబుతార‌ని… ఓట‌మి భ‌యంతోనే  కేసీఆర్ పిచ్చి ప‌నులు చేస్తున్నార‌న్నారు. పాత కేసుల‌తో కాంగ్రెస్ నేత‌ల‌ను అణ‌గ‌దొక్కే కుట్ర‌లు చేస్తున్నారు. మొన్న జ‌గ్గారెడ్డి, నేడు రేవంత్ రెడ్డి పై కుట్ర‌లు…టీఆర్ఎస్ చేత‌కానిత‌నానికి నిద‌ర్శ‌నాలు అన్నారు.

కాంగ్రెస్ నేత ష‌బ్బీర్ ఆలీ స్పందిస్తూ…కేసీఆర్ కు చ‌ట్టాల మీద న‌మ్మ‌కం లేదు. పాత కేసుల‌ను బ‌య‌ట‌కు తీసి కాంగ్రెస్ నేత‌ల‌ను ఇబ్బంది పెడుతున్నారు. రేవంత్ రెడ్డి, బంధువుల ఇళ్ల‌ల్లో సోదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు జైలు కొత్తేమీ కాద‌న్నారు. ప్ర‌జ‌ల కోసం జైలు కెళ్లాం. కేసీఆర్ భ‌య‌పెట్టి గెల‌వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆద‌ర‌ణ చూడ‌లేకే నేత‌ల పై వ‌రుస‌గా కేసులు పెడుతున్నారని… కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు భ‌య‌ప‌డ‌తారు అనుకుంటే కేసీఆర్ భ్ర‌మే అని కాంగ్రెస్ నేత పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here