Home Telugu రైట‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ రాజ‌సింహ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..!

రైట‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ రాజ‌సింహ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..!

105
0

రైట‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ రాజసింహ ముంబైలో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసారు. అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన రుద్ర‌మ‌దేవి సినిమాకి రాజ‌సింహ డైలాగులు రాసారు. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు తెలంగాణ యాస‌లో రాసిన మాట‌లు రాజ‌సింహ‌కు మంచి పేరు తీసుకువ‌చ్చాయి. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఒక్క అమ్మాయి తప్ప చిత్రంతో దర్శకుడిగానూ మారారు. అయితే..ఈ సినిమా పై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు కానీ…ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది.

అయితే…ఆశించిన స్ధాయిలో అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో…తీవ్ర నిరాశ‌కు గురైన రాజ‌సింహ‌ నిద్ర మాత్ర‌లు మింగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసారు. సోఫాలో చ‌ల‌నం లేకుండా అలా ఉండిపోవ‌డంతో కుటుంబ స‌భ్యులు హాస్ప‌ట‌ల్ కి తీసుకెళ్ళి చికిత్స చేయిస్తున్నారు.ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంది. ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని డాక్ట‌ర్స్ చెప్పిన‌ట్టు స‌మాచారం.  త్వ‌ర‌లోనే కోలుకోవాల‌ని ఆశిద్దాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here