Home News రైతాంగానికి అండ‌గా నిల‌బ‌డ‌తాం.. సుప‌రిపాల‌న అందిస్తాం – తెనాలి జ‌న‌సేన అభ్య‌ర్ధి నాదెండ్ల మ‌నోహ‌ర్

రైతాంగానికి అండ‌గా నిల‌బ‌డ‌తాం.. సుప‌రిపాల‌న అందిస్తాం – తెనాలి జ‌న‌సేన అభ్య‌ర్ధి నాదెండ్ల మ‌నోహ‌ర్

128
0


ప‌ది సంవ‌త్స‌రాలు శాస‌నస‌భ్యుడిగా ఉన్న‌ప్పుడు గుంటూరు, విజ‌య‌వాడ ప‌ట్ట‌ణాల‌కు దీటుగా తెనాలి నియోజ‌క‌వ‌ర్గం మారాల‌నే ఉద్దేశ్యంతో చాలా నిధులు తీసుకువ‌చ్చి అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేసామ‌ని తెనాలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన పార్టీ త‌రుపున పోటీ చేస్తోన్న నాదెండ్ల మ‌నోహ‌ర్ అన్నారు. ఆరోజున 2014న రాష్ట్ర విభజ‌న జ‌రుగుతున్న సంద‌ర్భంలో కొన్ని కార్య‌క్ర‌మాలు ప్ర‌భుత్వం నుంచి చేయ‌లేక‌పోయామ‌ని… అయినా ఈ ప్ర‌భుత్వం వ‌చ్చాకా అదే స్పీడులో అదే ఆలోచ‌న‌తోటి కార్య‌క్ర‌మాల‌ను ముందుకు తీసుకువెళ‌తారు అనుకుంటే అలా చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. 

శాస‌న‌స‌భ్యుడిగా ప్ర‌తి డిపార్ట్ మెంట్ లో ఇన్ వాల్వ్ అయి కార్య‌క్ర‌మాలు చేయించేవాడిని కానీ..ప్ర‌స్తుతం అలా జ‌ర‌గ‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ల నిర్మాణం జ‌ర‌గ‌లేదు. అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు స‌రైన రీతులో ప్ర‌జ‌ల‌కు అంద‌డం లేదు. అవ‌కాశాలు ఉన్నాయి కానీ.. స్పందించే వారు లేరు. మాన‌వ‌త్వం లేని ప్ర‌భుత్వం. అటువంటి పాల‌నను ఎవ‌రూ కోరుకోరు. ప్ర‌జ‌ల‌కు మేలు జ‌ర‌గాలి. అంద‌ర్నీ స‌మానంగా చూసుకోవాలి. ప్ర‌భుత్వం అంటే అంద‌రిది అన్న‌ట్టు ప్ర‌తి ఒక్క‌రు భావించాలి అని నాదెండ్ల మ‌నోహ‌ర్ చెప్పారు.

ప్ర‌భుత్వం… గెలిచిన రాజ‌కీయ నాయ‌కుల‌కో, కొంత మంది ప్ర‌జా ప్ర‌తినిధుల‌కో కాదు. అంద‌రి కోసం ఉప‌యోగ‌ప‌డే విధంగా ప‌ని చేయాలి. అదే ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. మా జ‌న‌సేన పార్టీ అంద‌రికీ మేలు జ‌ర‌గేట్టు ప‌ని చేస్తాది త‌ప్పా.. కొంత మంది కోసం ప‌ని చేయం. యువ‌త‌కు ఖ‌చ్చితంగా ఉపాధి క‌ల్పిస్తాం. రైతాంగానికి ఎప్పుడూ లేని విధంగా అండ‌గా నిల‌బ‌డ‌తాం. సుప‌రిపాల‌న అందించేట్టు ప‌ని చేస్తామ‌ని అందుచేత జ‌న‌సేన పార్టీని గెలిపించాల‌ని కోరుతున్నాను అన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here