Home Actor ర‌జ‌నీ – రాజ‌మౌళి కాంబినేష‌న్ లో మూవీ..?

ర‌జ‌నీ – రాజ‌మౌళి కాంబినేష‌న్ లో మూవీ..?

88
0

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా సత్తాను మ‌రోసారి ప్ర‌పంచానికి తెలియ‌చేసాడు. దీంతో రాజ‌మౌళితో వ‌ర్క్ చేయాల‌నేది ప్ర‌తి ఒక్క‌రి క‌లగా మారింది. ఇటీవ‌ల విద్యాబాల‌న్ కూడా రాజ‌మౌళితో వ‌ర్క్ చేయాల‌ని ఉంద‌ని చెప్పింది. ఇదిలా ఉంటే…సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ – ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్ లో మూవీ రూపొంద‌నుంద‌ని కోలీవుడ్ లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ న‌టించిన పేట సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న రిలీజ్ కానుంది.

ర‌జ‌నీకాంత్ త‌దుప‌రి చిత్రాన్ని మురగదాస్ తో చేయ‌నున్నారు.  ఆ తరువాత మళ్లీ కార్తీక్ సుబ్బరాజ్‌తో నటించనున్నారనే వార్తలు వ‌స్తున్నాయి. ఈ రెండు సినిమాలు పూర్తైన త‌ర్వాత రాజ‌మౌళితో ర‌జ‌నీ సినిమా ఉంటుంది అంటున్నారు. రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఎన్టీఆర్ – రామ్ చ‌ర‌ణ్ ల‌తో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యేలోపు ర‌జ‌నీ మురుగుదాస్, కార్తీక్ సుబ్బ‌రాజు సినిమాలు కంప్లీట్ చేస్తార‌ట‌. ర‌జ‌నీ- రాజ‌మౌళి క‌ల‌యిక‌లో సినిమా క‌న్ ఫ‌ర్మ్ అంటూ టాక్ వినిపిస్తోంది. మ‌రి…ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త వాస్త‌వమా..?   కాదా..? అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here