Home Actor ర‌ణ‌రంగం క‌థ ముందుగా ఎవ‌రికి చెప్పారో తెలుసా..?

ర‌ణ‌రంగం క‌థ ముందుగా ఎవ‌రికి చెప్పారో తెలుసా..?

18
0

యువ హీరో శ‌ర్వానంద్ న‌టించిన తాజా చిత్రం ర‌ణ‌రంగం. ఈ చిత్రానికి సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ మూవీని నిర్మించారు. శ‌ర్వానంద్ స‌ర‌స‌న కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌ లు న‌టించారు. ఈ నెల 15న ర‌ణ‌రంగం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ మాట్లాడుతూ…శర్వానంద్ చేసిన సినిమాల్లో నాకు ప్రస్థానం బాగా ఇష్టం. శర్వాతో చిత్రం చేస్తే ఫ్యామిలీ, లవ్ కాకుండా కొంచెం ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ తోనే సినిమా చేయాలని ఫిక్సయ్యాం. అలా అనుకున్న‌ప్పుడు రణరంగం క‌థ రాయ‌డం జ‌రిగింది.

అస‌లు.. ఈ కథను ముందుగా రవి తేజ గారికి చెప్పాను. ఆయనకి కథ బాగా నచ్చింది. బిజీగా ఉండటం వల్ల శర్వా కి ఓ సందర్భంలో కథ వినిపించాను. కథ వినగానే శర్వా ఇలాంటి ఛాలెంజింగ్ సినిమా చేయాలనుందని, రవితేజ గారిని కన్విన్స్ చేయమని అడిగాడు. వెంటనే రవితేజ సరే అన్నాక శర్వాకి లుక్ టెస్ట్ చేసి సినిమా మొదలుపెట్టాను. సినిమాలో విజువల్స్ఎక్స్ట్రార్డినరీ గా ఉంటాయి. ట్రైలర్ లో షాట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా ఖ‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here