Home Actor ర‌వితేజ ఆ..డైరెక్ట‌ర్ తో సినిమా చేయ‌నున్నాడా..?

ర‌వితేజ ఆ..డైరెక్ట‌ర్ తో సినిమా చేయ‌నున్నాడా..?

162
0

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం “డిస్కోరాజా”‌. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఈ నెల 27 నుంచి హైదరాబాద్ లో జరగనుంది. ఈ షెడ్యూల్ లో హీరో రవితేజ తో ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండ‌గానే ర‌వితేజ మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని స‌మాచారం.

ఈ సినిమాకి మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ర‌వితేజ‌తో మ‌లినేని గోపీచంద్ డాన్ శీను, బ‌లుపు చిత్రాలు తెర‌కెక్కించాడు. ఈ రెండు సినిమాలు స‌క్స‌స్ సాధించాయి. ఇప్పుడు ర‌వితేజ‌తో మూడ‌వ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నారు. మ‌రి.. ర‌వితేజ‌తో మ‌లినేని గోపీచంద్ హ్యాట్రిక్ సాధిస్తారేమో చూడాలి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here