Home Movie News ర‌వితేజ డిస్కోరాజా ప్రారంభం..!

ర‌వితేజ డిస్కోరాజా ప్రారంభం..!

65
0

మాస్ మ‌హారాజా ర‌వితేజ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని సినిమా త‌ర్వాత డిస్కోరాజా టైటిల్ తో సినిమా చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. ఆర్ఎక్స్ 100 పాయ‌ల్ రాజ్ ఫుత్ హీరోయిన్. ఈ చిత్రాన్ని విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు వి.ఐ ఆనంద్ తెర‌కెక్కించ‌నున్నారు.  ర‌వితేజ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా  రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేసింది. అయితే… ఈ సినిమా క‌థ విష‌యంలో మార్పులు చేర్పులు చేస్తున్నార‌ని… అందుచేత సెట్స్ పైకి వెళ్ల‌డానికి టైమ్ ప‌డుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.


ఈ వార్త‌ల‌కు ఫుల్ స్టాఫ్ పెట్టేలా ఈ రోజు ఈ సినిమాని ప్రారంభించారు. సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ గా రూపొందునున్న ఈ సినిమాలో పాయ‌ల్ రాజ్ ఫుత్ తో పాటు న‌భా న‌టేష్ కూడా న‌టిస్తున్నారు. రేప‌టి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. రీ ఎంట్రీలో రాజా ది గ్రేట్ సినిమాతో స‌క్స‌స్ సాధించిన ర‌వితేజ త‌ర్వాత మ‌ళ్లీ నిరాశ ప‌రిచాడు. మ‌రి..డిస్కోరాజాతో స‌క్స‌స్ సాధిస్తాడేమో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here