Home Actor ర‌ష్మిక‌కు బంపర్ ఆఫ‌ర్..!

ర‌ష్మిక‌కు బంపర్ ఆఫ‌ర్..!

99
0


ఛ‌లో సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి..తొలి చిత్రంతోనే అంద‌ర్నీ ఆక‌ట్టుకున్న క‌థానాయిక ర‌ష్మిక మంద‌న్న‌. ఆత‌ర్వాత గీత గోవిందం, దేవ‌దాస్ సినిమాల‌తో స‌క్స‌స్ సాధించిన ఈ అమ్మ‌డు కెరీర్ లో దూసుకెళుతోంది. యూత్ లో మాంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న ర‌ష్మిక ఓ వైపు తెలుగు, మ‌రో వైపు క‌న్న‌డ సినిమాల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే..ఈ క‌న్న‌డ సుంద‌రికి ఊహించ‌ని ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే…సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి సినిమా త‌ర్వాత‌ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న న‌టించే అద్భుత అవ‌కాశం ర‌ష్మిక ద‌క్కించుకున్న‌ట్టు స‌మాచారం. దిల్ రాజు, అనిల్ సుంక‌ర ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించ‌నున్నారని తెలిసింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లో ఈ మూవీని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నారు. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మైతే…ర‌ష్మిక‌కు బంప‌ర్ ఆఫ‌రే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here