Home Movie News ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ మ‌రోసారి షాక్ ఇచ్చిన వ‌ర్మ‌..!

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ మ‌రోసారి షాక్ ఇచ్చిన వ‌ర్మ‌..!

106
0
DpTb9RzXgAE71nN

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తానంటూ గ‌తంలో వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ ఎనౌన్స్ మెంట్ తో పాటు ఓ పాట కూడా రిలీజ్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసారు. అయితే…వ‌ర్మ తీయ‌బోయే ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఎన్టీఆర్ గా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తాడంటూ ప్ర‌చారం జ‌రిగింది కానీ..బాల‌య్య నో చెప్ప‌డంతో వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా ఎనౌన్స్ చేసాడు. దీంతో టీడీపీ నాయ‌కులు రంగంలోకి దిగి వ‌ర్మ ఎన్టీఆర్ బ‌యోపిక్ ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసారు.

ఆత‌ర్వాత ఏమైందో ఏమో కానీ…వ‌ర్మ సైలెంట్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే..ఎన్టీఆర్ బ‌యోపిక్ ను బాల‌య్య‌తో క్రిష్ తెర‌కెక్కిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు సైలెంట్ గా ఉన్న వ‌ర్మ ఈరోజు ట్విట్ట‌ర్ ద్వారా ల‌క్ష్మీ ఎన్టీఆర్ గురించి మ‌రోసారి ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. ద‌స‌రా కానుక‌గా ఈ నెల 19న తిరుప‌తిలో ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్న‌ట్టు తెలియ‌చేసారు. పూర్తి వివ‌రాల‌ను ఈ నెల 19న తిరుప‌తిలో ప్రెస్ మీట్ పెట్టి చెబుతాన‌న్నారు.

ఎన్టీఆర్ పై ఉన్న గౌర‌వంతో తిరుప‌తిలో బాలాజీ పాదాల ద‌గ్గ‌ర ముహుర్తం షాట్ చిత్రీక‌రించ‌నున్నాన‌ని…ద‌స‌రాకి ప్రారంభించే ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి నెలాఖ‌రున విడుల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు చెప్పారు. ఎవ‌రూ ఊహించ‌ని గెస్ట్ లు ఈ సినిమా ప్రారంభోత్స‌వంలో పాల్గొంటార‌ని అన్నారు. మ‌రి..వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ నిజ జీవితంలో జ‌రిగిన ఏ ఏ సంఘ‌ట‌న‌ల‌ను చూపిస్తారో..ఎన్టీఆర్ పాత్ర‌ను ఎవ‌రు పోషిస్తారో చూడాలి..!


 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here