Home Actor ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ వాయిదా. న్యూ డేట్ ఎనౌన్స్ చేసిన వ‌ర్మ‌..!

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ వాయిదా. న్యూ డేట్ ఎనౌన్స్ చేసిన వ‌ర్మ‌..!

96
0


సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. నంద‌మూరి తార‌క రామారావు జీవితంలోకి ల‌క్ష్మీ పార్వ‌తి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన కీల‌క ప‌రిణామాలు క‌థాంశంగా ఈ సినిమాని రూపొందించారు. ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో ఈ సినిమా పై మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. అయితే…ఈ సినిమా ఓట‌ర్ల పై ప్ర‌భావం చూపిస్తుంద‌ని…త‌మ పార్టీ అధినేత‌కు వ్య‌తిరేకంగా ఈ సినిమా రూపొందించార‌ని తెలుగు దేశం పార్టీ నాయ‌కులు ఎన్నిక‌ల సంఘంకు ఫిర్యాదు చేసారు.

ఈ ఫిర్యాదుని ప‌రిశీలించిన ఎన్నిక‌ల సంఘం..ఇది త‌మ ప‌రిధిలోకి రాదు. కాక‌పోతే ఏ పార్టీకైనా వ్య‌తిరేకంగా ఈ సినిమా ఉంటే అప్పుడు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ఈ సినిమా ఓట‌ర్ల పై ప్ర‌భావం చూపిస్తుంద‌ని…అందుచేత ఎన్నిక‌ల అనంత‌రం రిలీజ్ చేయాలి అంటూ సెన్సార్ బోర్డ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వర్మ కోర్టు కెళ్తానని… ఏది ఏమైనా మార్చి 22న సినిమాను విడుదల చేసి తీరుతానని ప్రకటించాడు.

ఆ తర్వాత కాసేపటికే సెన్సార్ బోర్డుతో నెలకొన్న అపార్థాలు తొలగిపోయాయని.. సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియ‌చేసారు. అయితే… సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ నెల 29న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా ఎనౌన్స్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here