Home Actor ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ.!

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ.!

190
0


సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏం జరిగింది..?  అనేది క‌థా వ‌స్తువుగా తీసుకుని ఈ సినిమాని వ‌ర్మ రూపొందించారు. ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను సినిమా ఎలా ఉండ‌బోతుంది అనే ఇంట్ర‌స్ట్ ఏర్ప‌డింది. దీనికి తోడు ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు చిత్రాలు ఫ్లాప్ అవ్వ‌డం..ఏపీలో ఈ సినిమా విడుద‌ల‌కు హైకోర్ట్ బ్రేక్ వేయ‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పై భారీ క్రేజ్ ఏర్ప‌డింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో త‌ప్పా..మిగిలిన అన్ని చోట్లా ఈ సినిమా రిలీజైంది. మ‌రి..ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అంచ‌నాల‌ను అందుకుందా..?  వ‌ర్మ‌కు విజ‌యాన్ని అందించిందా..?  లేదా..?  అనేది చెప్పాలంటే…ముందుగా క‌థ చెప్పాల్సిందే..!

క‌థ – 1989లో ఎన్టీఆర్ (విజ‌య్ కుమార్) అధికారం కోల్పోయి ఒంట‌రిగా ఉన్న ఎన్టీఆర్ ద‌గ్గ‌ర‌కు ల‌క్ష్మీ (య‌జ్ఞ శెట్టి) వ‌స్తుంది. బాగా చ‌దువుకున్న ఆమె గురించి తెలుసుకున్న ఎన్టీఆర్.. జీవిత చ‌రిత్ర రాసేందుకు అనుమ‌తి ఇస్తారు. అయితే….ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ల‌క్ష్మీపార్వ‌తి గురించి దుష్ర్ప‌చారం మొద‌ల‌వుతుంది. ఈ ప్ర‌చారం గురించి ఎన్టీఆర్ కు కూడా తెలుస్తుంది. ఆత‌ర్వాత‌…మేజ‌ర్ చంద్ర‌కాంత్ సినిమా ఫంక్ష‌న్ లో ల‌క్ష్మీపార్వ‌తిని పెళ్లి చేసుకోబోతున్న‌ట్టుగా ఎన్టీఆర్ ఎనౌన్స్ చేస్తారు. 1994లో ల‌క్ష్మీతో క‌లిసి ప్ర‌చారం చేసిన ఎన్టీఆర్ భారీ మెజార్టీతో విజ‌యం సాధించి అధికారం ద‌క్కించుకుంటారు. అయితే..కుటుంబ స‌భ్యుల‌ను త‌న వైపు తిప్పుకుని ఎన్టీఆర్ అల్లుడైన బాబురావ్ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం అవుతాడు. ఆత‌ర్వాత ఎన్టీఆర్ ఎలాంటి అవ‌మానాలు ఎదుర్కొన్నారు..? అప్పుడు ఆయ‌న ప‌రిస్థితి ఏంటి..?  ఎలా చ‌నిపోయాడు అనేదే క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

క‌థ‌, క‌థ‌నం

ముఖ్య‌పాత్ర‌ల న‌ట‌న‌

సంగీతం

మైన‌స్ పాయింట్స్

అక్క‌డ‌క్క‌డా స్లోగా ఉండ‌డం

విశ్లేష‌ణ – ఎన్టీఆర్ కు, ల‌క్ష్మీపార్వ‌తి ఎలా దగ్గ‌ర‌య్యింది..?  వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీసింది..? అప్పుడు ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు ఎలా ఫీల‌య్యారు..? త‌దిత‌ర‌ నిజాల‌ను తెర పై చూపించే ప్ర‌య‌త్నం చేసారు. వ‌ర్మ ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన‌ప్పుడు ఇందులో న‌టించే న‌టీన‌టులు ఎవ‌రు..?  ఎన్టీఆర్ పాత్ర ఎవ‌రు పోషిస్తారు..? చ‌ంద్ర‌బాబు పాత్ర ఎవ‌రు పోషిస్తారు..?  ఇలా అనే సందేహాలు వ‌చ్చాయి. అయితే… ఎంచుకున్నే క‌థే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి క‌లిగిస్తుంది కాబ‌ట్టి..స్టార్స్ తో ఈ సినిమాని తీయాలి. మ‌రింత‌గా క్రేజ్ తీసుకురావాలి అని వ‌ర్మ ఆలోచించ‌లేదు.

ఆ పాత్ర‌ల‌కు ఎవ‌రు క‌రెక్ట్ సెట్ అవుతారో..వాళ్ల‌ని ఎంచుకున్నాడు. ఇలా ఎంచుకోవ‌డంలోనే వ‌ర్మ స‌గం విజ‌యం సాధించారు. విజయ్‌ కుమార్‌,   య‌జ్ఞ శెట్టి, బాబు రావు పాత్ర‌లో శ్రీతేజ్ అద్భుతంగా న‌టించారు. వీళ్లే కాకుండా..ఇందులో న‌టించిన ప్ర‌తి ఆర్టిస్ట్ నుంచి వ‌ర్మ‌ అద్భుత‌మైన న‌ట‌న రాబ‌ట్టారు. ముఖ్యంగా ఎన్టీఆర్, ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర‌ల పై చిత్రీక‌రించిన స‌న్నివేశాలు ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ సినిమాకి ఆర్టిస్ట్ ల‌తో పాటు మ‌రో హైలైట్ అంటే…క‌ళ్యాణి మాలిక్ సంగీతం అని చెప్ప‌చ్చు. ఆయ‌న స‌న్నివేశానికి త‌గ్గ‌ట్టు బాణీలు అందించి ఆ స‌న్నివేశం స్ధాయిని పెంచారు. ముఖ్యంగా ఎమోష‌న‌ల్ సీన్స్ లో క‌ళ్యాణి మాలిక్ వ‌ర్క్ క‌నిపిస్తుంది. సినిమాటోగ్ర‌ఫీ, ఎడిటింగ్, సినిమాటోగ్ర‌ఫీ..బాగున్నాయి.

 ఆర్జీవీ ఈజ్ బ్యాక్…

రామ్ గోపాల్ వర్మ ఎంత ధైర్యవంతుడో లక్ష్మీస్ ఎన్టీఆర్ చూస్తే అర్థమవుతుంది. తాను నమ్మిన నిజాన్ని నిర్భయంగా చెప్పాడు.

 రామగోపాల్ వర్మగారు వొళ్ళు దగ్గర పెట్టుకుని తీసిన సినిమా..

ఇలా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారంటే..ఈ సినిమా ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు..!

రేటింగ్ – 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here