Home Actor ల‌క్ష్మీస్ ఎన్టీఆర్, ల‌క్ష్మీస్ వీర గ్రంథం సినిమాల‌కు లైన్ క్లియ‌ర్..!

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్, ల‌క్ష్మీస్ వీర గ్రంథం సినిమాల‌కు లైన్ క్లియ‌ర్..!

64
0


నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్, ల‌క్ష్మీస్ వీర గ్రంథం చిత్రాల విడుద‌ల‌ను ఆపాలంటూ తెలంగాణ‌ హైకోర్టులో పిటిష‌న్ వేసారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ రెండు చిత్రాలు విడుద‌ల చేయ‌వ‌ద్దు అంటూ స‌త్య‌నారాయ‌ణ అనే వ్య‌క్తి లంచ్ మోష‌న్ పిటిష‌న్ వేసారు. ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తే శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగే అవ‌కాశం ఉంద‌ని పిటిష‌న‌ర్ కోర్టుకు తెలియ‌చేసాడు. దీని పై విచార‌ణ చేసిన హైకోర్టు భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో మేము కలగజేసుకోలేమని తెలియ‌చేసింది.

అందుచేత ఈ సినిమాల విడుదలను ఆపాలని వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. రెండు సినిమాల్లో  సన్నివేశాలు  ఏవైనా అభ్యంతరకరంగా ఉంటే వాటి పై చర్యలు తీసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణాలో సినిమా విడుదల చేసిన ఎలాంటి ఇబ్బంది లేదు.  లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలగకుండా మా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు అని తెలంగాణా అడ్వకేట్ జనరల్ తెలియ‌చేసారు. దీంతో సినిమా విడుదలకి న్యాయ‌స్ధానం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here