Home Political News ల‌గ‌డ‌పాటి స‌ర్వే – మ‌హాకూట‌మికే అత్య‌ధిక సీట్లు..!

ల‌గ‌డ‌పాటి స‌ర్వే – మ‌హాకూట‌మికే అత్య‌ధిక సీట్లు..!

114
0

ల‌గ‌డ‌పాటి స‌ర్వేకి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు… అంద‌రికీ తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల్లో ఈసారి ఏ పార్టీ అధికారం ద‌క్కించుకుంటుంది..? ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఫ‌లితాలు ఎలా ఉంటాయి..? అనేది ఆస‌క్తిగా మారింది. అయితే…ఈరోజు 7 రాత్రి గంట‌ల‌కు ల‌గ‌డ‌పాటి సర్వే ఫ‌లితాలు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ల‌గ‌డ‌పాటి మీడియాతో మాట్లాడుతూ…గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. ఈ ఎన్నికల్లో ఖర్చు విపరీతంగా పెరిగిపోయిందని చెప్పారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి 10 స్థానాలు అటూ ఇటుగా 65 స్థానాలు గెలుస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ 10 స్థానాలు అటూ ఇటుగా 35 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంటుందని తెలిపారు. టీడీపీ పోటీ చేసిన 13 స్థానాల్లో రెండు స్థానాలు అటూఇటుగా 7 స్ధానాలు గెలుస్తుందని లగడపాటి చెప్పారు. టీడీపీ పోటీ చేస్తున్న స్థానాల్లో ఇద్దరు ఇండిపెండెంట్లు గెలస్తారని ఆయ‌న చెప్పారు.

టీడీపీ పోటీ చేస్తున్న మరో స్థానంలో ఎంఐఎం బలంగా ఉందని .. ఎంఐఎంకు 6 స్థానాలు వస్తాయని చెప్పారు. సీపీఎం ఒక స్థానంలో గెలుపొందే అవకాశం ఉందని చెప్పారు. ఇక బీజేపీ రెండు స్థానాలు అటూఇటుగా 7 స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు. ఇండిపెండెంట్లు 2 స్థానాలు అటూ ఇటుగా 7 స్థానాలను గెలుచుకుంటారని తెలిపారు. మిగిలిన స‌ర్వేలు టీఆర్ఎస్ కి అనుకూలంగా చెబితే..ల‌గ‌డ‌పాటి స‌ర్వే మాత్రం మ‌హాకూట‌మికే అత్య‌ధిక సీట్లు అని చెప్పింది. దీంతో ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని ఉత్కంఠ ఏర్ప‌డింది. అయితే…వాస్త‌వ‌ల ఫ‌లితాలు మాత్రం ఈ నెల 11న తెలుస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here