Home Events ల‌వ్ మ్యారేజ్ చేసుకొన్న థాయిలాండ్ చ‌క్ర‌వ‌ర్తి.. సినిమా టిక్ ప్రేమ క‌థ‌..!

ల‌వ్ మ్యారేజ్ చేసుకొన్న థాయిలాండ్ చ‌క్ర‌వ‌ర్తి.. సినిమా టిక్ ప్రేమ క‌థ‌..!

115
0

ప్రేమ‌లు, ప్రేమ పెళ్లిళ్లు ఇటీవ‌ల కాలంలో కామ‌న్ గా మారాయి. కానీ చ‌క్ర‌వ‌ర్తుల కుటుంబాల్లో ల‌వ్ మ్యారేజ్ లు అంటే మాత్రం అంద‌రికీ ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. స‌రిగ్గా థాయిలాండ్ లో అదే జ‌రిగింది. శ‌నివారం ప‌ట్టాభిషేకం చేసుకోబోతున్న చ‌క్ర‌వ‌ర్తి వ‌జ్ర లాంగ్ కోన్ బుధ‌వారం నాడు స‌డెన్ గా  ల‌వ్ మ్యారేజ్ చేసుకొన్నారు. ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా ఇది సంచ‌ల‌నం రేకెత్తించింది.

వాస్త‌వానికి థాయిలాండ్ లో రాజ వంశానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. చ‌క్ర‌వ‌ర్తి భూమిపాల్ అతుల్ తేజ్ గ‌త ఏడాది చ‌నిపోయారు. అప్ప‌టి దాకా ఆయ‌న పాల‌న‌లోనే థాయిలాండ్ ఉంది. దీంతో ఆయ‌న కుమారుడు వ‌జ్ర లాండ్ కోన్ ను వార‌సుడిగా నిర్ణ‌యించారు. కానీ రాజ లాంఛ‌నాలు పూర్త‌య్యేస‌రికి కొంత స‌మ‌యం ప‌ట్ట‌డంతో ఆయ‌న ప‌ట్టాభిషేకం కార్య‌క్ర‌మం వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. చివ‌ర‌కు వ‌చ్చే శ‌నివారం నాడు ఆయ‌న్ని థాయిలాండ్ చ‌క్ర‌వ‌ర్తిగా ప్ర‌క‌టించేందుకు రంగం సిద్దం అయంది. ఇక నుంచి ఆయ‌న్ని మ‌హారాజు ప‌దో రామ గా పిల‌వాల‌ని నిర్ణ‌యించారు.

అంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, ఇప్ప‌టి దాకా రాచ మ‌హ‌ల్ లో కూర్చొని ఉన్న యువ రాజు వజ్ర లాంగ్ కోన్ ఒక ప్రేమాయ‌ణం న‌డుపుతున్నారు. ఆ సంగ‌తి చాలా సీక్రెట్ గా ఉంచారు. వాస్త‌వానికి 2014 లో థాయిలాండ్ ఎయిర్ లైన్స్ లో ప‌నిచేస్తున్న ఒక ఎయిర్ హోస్టెస్ ను ఇష్ట‌ప‌డ్డారు. కొన్ని సార్లు ఆమె కోసం ఫ్లైట్ లో చ‌క్క‌ర్లు కొట్టారు. త‌ర్వాత ఆమె ఉద్యోగం గురించి తెలుసుకొని, రాజ‌మ‌హల్ లో గార్డు గా ఉద్యోగం ఇప్పించారు. మంచి జీతం, పొజిష‌న్ బాగుండ‌టంతో ఆమె ఎగిరి గంతేసి ఉద్యోగంలో చేరారు. త‌ర్వాత నెమ్మ‌దిగా ఆమెతో ప్రేమాయ‌ణం మొద‌లెట్టి లైన్ లోకి తెచ్చేసుకొన్నారు.

 రాజ‌మ‌హ‌ల్ లో గ‌ప్ చుప్ గా ఈ ప్రేమాయ‌ణం సాగుతున్న స‌మ‌యంలోనే తండ్రి అతుల్ తేజ్ కు అనారోగ్యం ఏర్ప‌డ‌టంతో యువ‌రాజు యాక్టివ్ పార్ట్ తీసుకొన్నారు. ఈ స‌మ‌యంలో ప‌ర్స‌నల్ గార్డుల టీమ్ లో త‌న ల‌వ‌ర్ కు ఉద్యోగం ఏర్పాటు చేయించి ప్రేమాయ‌ణం కొనసాగించారు. మ‌హారాజు మ‌ర‌ణించ‌టంతో ఇక చ‌క్ర‌వ‌ర్తిగా ప‌ట్టాభిషేకంకు రంగం సిద్దం అయింది.

 దీంతో ప్రేయ‌సి త‌ల్లిదండ్రులతో సంప్ర‌దించి, అధికారికంగా వివాహం చేసుకొన్నారు. ఆమెకు మ‌హారాణి సుతీద అని పేరు పెట్టారు. దీంతో ఈ ప్రేమ జంట అధికారికంగా దంప‌తులుగా మారారు. శ‌నివారం ప‌ట్టాభిషేకం త‌ర్వాత బ్యాంకాగ్  న‌గ‌ర వీధుల్లో భారీ ఊరేగింపు ఏర్పాటు చేశారు. అదండీ రాజ‌మ‌హ‌ల్ లో రాజుగారు న‌డిపిన ప్రేమ క‌థ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here