Home Actor వాటిని వ‌దిలేస్తేనే గెలుస్తాం – విజ‌య్ దేవ‌రకొండ‌

వాటిని వ‌దిలేస్తేనే గెలుస్తాం – విజ‌య్ దేవ‌రకొండ‌

37
0
వాటిని వ‌దిలేస్తేనే గెలుస్తాం - విజ‌య్ దేవ‌రకొండ‌ spiceandhra

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా… ఇలా వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను ఎంచుకుని స‌క్స‌స్ సాధించి యూత్ లో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. నూత‌న ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం డియర్ కామ్రేడ్. గీత గోవిందం సినిమాలో జంట‌గా న‌టించిన విజ‌య్, ర‌ష్మిక ఈ సినిమాలో కూడా జంట‌గా న‌టించ‌డంతో ఈ మూవీ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఈ నెల 26న ఈ సినిమాని తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర యూనిట్ హైద‌రాబాద్‌లో మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ను నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో సినిమాలోని పాట‌ల‌ను లైవ్‌గా ప్ర‌ద‌ర్శించ‌డ‌మే కాకుండా, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక స్టేజ్‌పై పాట‌ల‌కు డ్యాన్సులు చేసి ప్రేక్ష‌కుల‌ను అల‌రించడం విశేషం.

ఈ సంద‌ర్భంగా విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ… మ‌నంద‌రిలో చాలా భ‌యాలుంటాయి. అయితే వాటిని వ‌దిలేస్తేనే మ‌నం గెలుస్తాం. నేను కూడా న‌టుడు అవ్వాల‌నుకున్న‌ప్పుడు భ‌య‌మేసింది. మ‌న‌కు కావాల్సిన దాని కోసం పోరాటం చేయాలి. అప్పుడే అది మ‌న‌కు ద‌క్కుతుంది. ఈ విష‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్న‌మే డియర్ కామ్రేడ్‌ సినిమా. బెంగ‌ళూరు, కొచ్చి, చెన్నైల్లో ఈ సినిమా మ్యూజిక్ ఫెస్టివ‌ల్స్ చేశాం. ప్రేక్ష‌కులు ప్ర‌తిచోటా మాకు ప్రేమ‌నే పంచారు. ఇంత ప్రేమ‌కు థ్యాంక్స్ చెబితే స‌రిపోతుందా? అనిపించింది. జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. ద‌క్షిణాది భాష‌ల్లో చేసిన తొలి ప్ర‌య‌త్నం ఇది. ప్రేక్ష‌కులు ఖ‌చ్చితంగా  ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here