Home Actor వాడు, నా పిల్ల‌లు క‌లిసి న‌న్ను చంపేసారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్ 2 సంచ‌ల‌నం..!

వాడు, నా పిల్ల‌లు క‌లిసి న‌న్ను చంపేసారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్ 2 సంచ‌ల‌నం..!

84
0


సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న తాజా చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు ఫ్లాప్ అవ్వ‌డంతో  ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పై మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. తాజాగా వ‌ర్మ ఈ మూవీ సెకండ్ ట్రైల‌ర్ ను ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. వాడూ, నా పిల్లలు కలిసి నన్ను చంపేశారు అన్న ట్యాగ్ లైన్ తో స్టార్ట్ అయిన‌ ఈ ట్రయిలర్ లో ఎన్టీఆర్ జీవితంలోని పలు ఘట్టాలను చూపించారు.

మీరనుకున్నట్టు ఆవిడ అంత మంచి మనిషి కాదు… ఇంతకుముందే ఆవిడకు చాలామందితో అఫైర్స్ ఉన్నాయని…అని చంద్రబాబు పాత్రధారి డైలాగ్ వినిపిస్తోంది. ఆత‌ర్వాత లక్ష్మీ పార్వతి…రామారావు గారు, ఆయన్ను పెళ్లి చేసుకోమని అడిగారు అనే డైలాగ్..శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి మహామహా అందగత్తెలతో పరిచయమున్న ఆయనకి… దానిలో ఏముందనో…అని ఎన్టీఆర్ కుమార్తె డైలాగ్, మనం ఎందుకూ పనికిరాని దద్దమ్మల మనుకుంటున్నారా, నా కొడుకు లోకేశ్ మీద ఒట్టేసి చెబుతున్నాను. దానిని ఆపాలని నేను చేసే ప్రయత్నంలో నాకు హండ్రెడ్ పర్సంట్ సపోర్ట్ కావాలి అన్న డైలాగులు సినిమా పై మ‌రింత ఆస‌క్తిని పెంచుతున్నాయి.

ఇలా ట్రైల‌ర్ రిలీజ్ చేసారో లేదో..అలా యూట్యూబ్ లో రికార్డు స్ధాయి వ్యూస్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. మ‌రి..ట్రైల‌రే ఇలా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంటే..ఇక సినిమా ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here