Home Actor వారంద‌రికీ.. థ్యాంక్స్ చెప్పిన సాహో.

వారంద‌రికీ.. థ్యాంక్స్ చెప్పిన సాహో.

18
0
వారంద‌రికీ.. థ్యాంక్స్ చెప్పిన సాహో. spiceandhra

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తాజా చిత్రం సాహో. యువ ద‌ర్శ‌కుడు సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని యు.వి. క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తుంది. ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ భామ శ్ర‌ద్ధా క‌ఫూర్ న‌టిస్తున్న ఈ సంచ‌ల‌న చిత్రాన్ని ఆగ‌ష్టు 15న రిలీజ్ చేయాల‌నుకున్నారు అయితే… గ్రాఫిక్స్ వ‌ర్క్ కి ఎక్కువ టైమ్ ప‌డుతుండ‌డం వ‌ల‌న సాహో వాయిదా ప‌డింది.

ఆగ‌ష్టు 15న రిలీజ్ చేయాల‌నుకున్న ఈ సినిమాని ఆగ‌ష్టు 30న విడుద‌ల చేస్తున్న‌ విష‌యం తెలిసిందే. ఇలా సాహో వాయిదా ప‌డ‌డం వ‌ల‌న  తెలుగులో గ్యాంగ్ లీడ‌ర్, వాల్మీకి చిత్రాల డేట్స్ మార్చుకోవాల్సి వ‌చ్చింది. అలాగే త‌మిళ్ లో సూర్య కాప్ప‌న్ (బందోబ‌స్త్),  హిందీ మూవీ చిచోరే కూడా సెప్టెంబర్ 6కు షిఫ్ట్ అయ్యింది.

ఇలా.. సాహో ఆగ‌ష్టు 30న రావ‌డం వ‌ల‌న తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాలు త‌మ రిలీజ్ డేట్స్ మార్చుకోవ‌ల్సి వ‌చ్చింది. అందుచేత దీనిపై ప్రభాస్ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 30న సాహో విడుదలకు మార్గం సుగమం చేసిన నటీనటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీపై ఎల్లప్పుడూ ప్రేమాభిమానాలు ఉంటాయి, ఆల్ ది బెస్ట్ అంటూ ప్ర‌భాస్ విషెస్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here