Home Actor వాల్మీకి రిలీజ్ డేట్ మారింది. ఇంత‌కీ రిలీజ్ ఎప్పుడు..?

వాల్మీకి రిలీజ్ డేట్ మారింది. ఇంత‌కీ రిలీజ్ ఎప్పుడు..?

85
0
వాల్మీకి రిలీజ్ డేట్ మారింది. ఇంత‌కీ రిలీజ్ ఎప్పుడు..? spiceandhra

మెగా హీరో వ‌రుణ్ తేజ్ – గబ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న చిత్రం వాల్మీకి. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌రుణ్ తేజ్ గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. త‌మిళ హీరో అధ‌ర్వ ముర‌ళి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ఈ సినిమాని సెప్టెంబ‌ర్ 6న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు గ‌తంలో ఎనౌన్స్ చేసారు అయితే… ప్ర‌భాస్ సాహో సినిమా ఆగ‌ష్టు 15న రిలీజ్ చేయాల‌నుకున్నారు కానీ.. గ్రాఫిక్స్ వ‌ర్క్ కి ఎక్కువ టైమ్ ప‌డుతుండ‌డం వ‌ల‌న ఆగ‌ష్టు 30న రిలీజ్ చేస్తున్నారు. అందుచేత సెప్టెంబ‌ర్ 6న రావాల్సిన వాల్మీకి వాయిదా ప‌డిన‌ట్టు స‌మాచారం. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…వాల్మీకి రిలీజ్ డేట్ మ‌రో వారం వెన‌క్కి జ‌రిపి సెప్టెంబ‌ర్ 13న రిలీజ్ చేయ‌డానికి ఫిక్స్ చేసార‌ని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here