Home Actor విజ‌య్ ఆంటోని, అర్జున్ న‌టించిన `కిల్ల‌ర్` విడుద‌ల తేదీ ఖ‌రారు..!

విజ‌య్ ఆంటోని, అర్జున్ న‌టించిన `కిల్ల‌ర్` విడుద‌ల తేదీ ఖ‌రారు..!

74
0

విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ తాజా చిత్రం కొలైగార‌న్. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా క‌థానాయిక‌. దియా మూవీస్ ఈ చిత్రాన్ని త‌మిళంలో నిర్మించింది. ఈ చిత్రాన్ని పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై టి.న‌రేష్ కుమార్- టి.శ్రీ‌ధ‌ర్ `కిల్ల‌ర్` పేరుతో తెలుగులో అనువ‌దించి విడుద‌ల చేస్తున్నారు.  ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి. జూన్ తొలి వారంలో ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ.. క్రైమ్ థ్రిల్ల‌ర్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ  సినిమా టీజ‌ర్ ఇటీవ‌లే రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. విజ‌య్ ఆంటోని.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ పోటాపోటీగా న‌టించిన‌ చిత్ర‌మిద‌ని తెలుస్తోంది. ఈ చిత్రానికి సైమ‌న్.కె.సింగ్ సంగీతం అందిస్తున్నారు.

తెలుగు వెర్ష‌న్ నిర్మాత‌లు టి.న‌రేష్ కుమార్- టి.శ్రీ‌ధ‌ర్ మాట్లాడుతూ… క్రైమ్ జోన‌ర్ లో యూనిక్ కాన్సెప్ట్ ఉన్న చిత్ర‌మిది. సినిమా ఆద్యంతం గ్రిప్పింగ్ నేరేష‌న్ తో ర‌క్తి క‌ట్టిస్తుంది. అర్జున్ న‌ట‌న సినిమాకే హైలైట్. విజ‌య్ ఆంటోని పాత్ర ఏమిటి అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్‌. తెలుగు వెర్ష‌న్ ని ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో అనువ‌దిస్తున్నాం. అన్ని వ‌ర్గాల్ని మెప్పించే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్న చిత్ర‌మిది. ఇటివలే దుబాయ్ లోని  అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటలతో చిత్రీకరణ పుర్తి చేసుకున్నాం . ఇటివలే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్  వచ్చింది . మే రెండవ వారంలో  ట్రైలర్ విడుదల చేస్తున్నాం. రంజాన్ కానుకగా జూన్ తొలి వారంలో  సినిమా విడుదల చేయ‌డానికి సన్నాహలు చేస్తున్నాం అని  అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here