Home Actor విన‌య విధేయ రామ గురించి అభిమానుల‌కు లేఖ రాసిన రామ్ చ‌ర‌ణ్‌.!

విన‌య విధేయ రామ గురించి అభిమానుల‌కు లేఖ రాసిన రామ్ చ‌ర‌ణ్‌.!

143
0

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ విన‌య విధేయ రామ‌. డి.వి.వి.దాన‌య్య నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే..ఈ సినిమా అంచ‌నాల‌ను ఏమాత్రం అందుకోలేక‌పోయింది. అభిమానుల‌ను బాగా నిరాశ ప‌రిచింది. ఈ సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ విన‌య విధేయ రామ గురించి ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.

ప్రియ‌మైన అభిమానులు మ‌రియు ప్రేక్ష‌కుల‌కు..

నా ప‌ట్ల మ‌రియు నా సినిమాల ప‌ట్ల మీరు చూపించిన ప్రేమ, అభిమానాల‌కు విన‌మ్ర‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు.

మా విన‌య విధేయ రామ సినిమా కోసం రేయింబ‌వ‌ళ్లు క‌ష్టించిన సాంకేతిక నిపుణులు అంద‌రికీ నా ధ‌న్య‌వాదాలు. నిర్మాత దాన‌య్య గారు అందించిన స‌హ‌కారం మాట‌ల్లో వ‌ర్ణించ‌లేనిది. మా చిత్రాన్ని న‌మ్మిన పంపిణీదారులు మ‌రియు ప్ర‌ద‌ర్శ‌న‌దారుల‌కి కృత‌జ‌న్యుడనై ఉంటాను.

మీ అంద‌రికీ న‌చ్చి మిమ్మ‌ల్ని వినోదింప చేసే సినిమా అందించ‌టానికి మేమంతా ఎంత‌గానో శ్ర‌మించాం. దుర‌దృష్ట‌వ‌శాత్తు మేము అనుకున్న విధంగా ఒక మంచి సినిమాని అందించ‌లేక మీ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయాం.

మీరు చూపించే ఈ ఆద‌ర‌ణ అభిమానాన్ని ప్రేర‌ణ‌గా తీసుకుని భ‌విష్య‌త్తులో మీకు న‌చ్చే మీరు మెచ్చే సినిమాలు చేయ‌టానికి శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తాను. అన్నివేళ‌ల త‌మ మ‌ద్ద‌తు నాకు అందించిన మీడియా మిత్రుల‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. మీరు ఎల్ల‌ప్పుడూ చూపించే ఈ ప్రేమ మ‌రియు అభిమానానికి ధ‌న్య‌వాదాలు

ప్రేమ‌తో

మీ

రామ్ చ‌ర‌ణ్.

సినిమా ఫ్లాప్ అయితే…మ‌న‌ హీరోలు ఆ సినిమా గురించి మాట్లాడానికి ఏమాత్రం ఆస‌క్తి చూపించ‌రు. కొంత మంది హీరోలు అయితే…ఫ్లాప్ సినిమాని  కూడా హిట్ సినిమాగానే చెబుతారు. ఫ్లాప్ అంటే ఒప్పుకోరు కానీ…రామ్ చ‌ర‌ణ్ విన‌య విధేయ రామ చిత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. మీకు న‌చ్చే మీరు మెచ్చే సినిమాలు చేయ‌టానికి శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తాను అంటూ అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు లేఖ రాయ‌డం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here