Home Actor విన‌య విధేయ రామ ట్రైల‌ర్ రిలీజ్ కు ముహుర్తం ఖ‌రారు..!

విన‌య విధేయ రామ ట్రైల‌ర్ రిలీజ్ కు ముహుర్తం ఖ‌రారు..!

94
0

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ విన‌య విధేయ రామ‌. డి.వి.వి ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 27న యూస‌ఫ్ గూడ‌లోని పోలీస్ గ్రౌండ్స్ లో జ‌ర‌నుంద‌న్న విష‌యం తెలిసిందే. భారీ స్ధాయిలో నిర్వ‌హించే ఈ ఫంక్ష‌న్ కు మెగాస్టార్ చిరంజీవి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధులుగా హాజ‌రు కానున్నార‌ని తెలిసింది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే…ఈ మూవీ ట్రైల‌ర్ ను ఈ నెల 27న రాత్రి 9 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు. అలాగే ఈ మూవీ జూక్ బాక్స్ ను కూడా రేపు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసింది. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాని న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాణంగా న‌టిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here