Home Actor విన‌య విధేయ రామ రివ్యూ..!

విన‌య విధేయ రామ రివ్యూ..!

235
0

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ విన‌య విధేయ రామ‌. డి.వి.వి. ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై భారీ చిత్రాల నిర్మాత దాన‌య్య ఈ సినిమాని నిర్మించారు. బోయ‌పాటి సినిమా అంటే ఫ్యామిలీ ఎమోష‌న్స్ తో పాటు భారీ యాక్ష‌న్స్ సీన్స్ ఉంటాయ‌నేది అంద‌రికీ తెలిసిందే. ఇక ఈ ఊర మాస్ డైరెక్ట‌ర్ కి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తోడైతే ఆ సినిమా ఏరేంజ్ లో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే భారీ యాక్ష‌న్ సీన్స్ తో ఈ సినిమాని రూపొందించారు. సంక్రాంతి కానుక‌గా ఈ రోజు విన‌య విధేయ రామ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి…ధృవ‌, రంగ‌స్థ‌లం చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించిన రామ్ చ‌ర‌ణ్ కి విన‌య విధేయ రామ హ్యాట్రిక్ విజ‌యాన్ని అందించిందా..? లేదా..? అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే..!

క‌థ – న‌లుగురు అనాధ పిల్ల‌లు చెత్త కాగితాలు ఏరుకుంటూ..ఎందుకు బ‌తుకుతున్నామో తెలియ‌క అలా బ‌తికేస్తుంటారు. అయితే..అనుకోని ప‌రిస్థితులు ఎదుర‌వ్వ‌డం వ‌ల‌న బ‌త‌కడం కంటే చ‌నిపోవ‌డ‌మే మంచిది అనుకుంటారు. రైలు ప‌ట్టాల ద‌గ్గ‌ర న‌లుగురు అనాధ పిల్ల‌లు చనిపోదాం అనుకునే స‌రికి ఓ ప‌సిపిల్లాడి ఏడుపు విన‌ప‌డుతుంది. వెంట‌నే ఈ న‌లుగురు ఆ ప‌సివాడిని కాపాడ‌తారు. అప్ప‌టి నుంచి ఈ ఐదుగురు అన్న‌ద‌మ్ములుగా క‌లిసుంటారు. ఆ ప‌సివాడే రామ్ కొణ‌దెల (రామ్ చ‌ర‌ణ్) అవుతాడు. పెద్ద‌న్న‌య్య భువ‌న్ (ప్ర‌శాంత్). ఆయ‌న ఎన్నిక‌ల అధికారి. వైజాగ్‌లో భువ‌న్ బై ఎలక్ష‌న్స్‌లో పందెం ప‌రుశురాం(ముఖేష్ రుషి) బావ మ‌రిది బ‌ల్లెం బ‌ల‌రాం(హ‌రీష్ ఉత్త‌మ‌న్‌) ఎదురు నిలిచి ఎల‌క్ష‌న్స్ సజావుగా సాగేలా చూస్తాడు.

అయితే..భువ‌న్ ని భ‌య‌ పెట్టాల‌నుకున్న పందెం ప‌ర‌శురామ్ మ‌నుషుల‌ను రామ్ చిత‌గ్గొడ‌తాడు. దీంతో ప‌ర‌శురామ్ ఎస్పీ స‌హ‌కారంతో అంద‌రినీ ఎన్ కౌంట‌ర్ చేయాల‌నుకుంటాడు. అయితే…అనుకోకుండా బీహ‌ర్ నుండి వ‌చ్చిన రాజు భాయ్‌(వివేక్ ఒబెరాయ్ ) మ‌నుషులు రామ్ కుటుంబాన్ని చంపాల‌నుకుంటే.. రామ్ అంద‌రినీ చంపేస్తాడు. అప్పుడు బీహార్ ముఖ్య‌మంత్రి(మ‌హేష్ మంజ్రేక‌ర్‌) వ‌చ్చి రామ్‌తో మాట్లాడటం చూసిన ఎస్‌.పి షాక్ అవుతాడు. అస‌లు..రామ్ కి రాజుభాయ్ కి ఉన్న సంబంధం ఏంటి..? బీహార్ ముఖ్య‌మంత్రి రామ్ కోసం ఎందుకు వ‌చ్చాడు..? చివ‌ర‌కి ఏం జ‌రిగింది అనేదే క‌థ‌

ప్ల‌స్ పాయింట్స్
రామ్ చ‌ర‌ణ్
ఇంట‌ర్వెల్ ఫైట్

మైన‌స్ పాయింట్స్
క‌థ – క‌థ‌నం
లాజిక్ లు లేక‌పోవ‌డం..
మితిమీరిన హింస‌

విశ్లేష‌ణ – బోయ‌పాటి సినిమా అంటే ఎలా ఉంటుందో తెలిసిందే. కాక‌పోతే ఇప్ప‌టి వ‌ర‌కు బోయ‌పాటి తీసిన సినిమాల్లో క‌థ ఆ క‌థ‌కు త‌గ్గ‌ట్టు క‌థ‌నం ఉండేది కానీ..ఈ సినిమాలో అవి లేవు. ముందుగా యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఇలా ఉంటాయి అని రాసేసుకుని ఆత‌ర్వాత దీనికి త‌గ్గ‌ట్టు క‌థ రాసుకున్నారా అనిపిస్తుంది. హీరోను ప‌వ‌ర్ ఫుల్ గా చూపించే బోయ‌పాటి ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ ని అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ప‌వ‌ర్ ఫుల్ గా చూపించారు. పాత్ర‌కు తగ్గ‌ట్టు రామ్ చ‌ర‌ణ్.. రామ్ కొణిదెల పాత్ర‌లో మాస్ ని ఆకట్టుకునేలా చాలా బాగా న‌టించాడు. యాక్ష‌న్ ఎపిసోడ్స్ ను మాస్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా అద్భుతంగా తెర‌కెక్కించ‌డంలో బోయ‌పాటి దిట్ట‌. ఎవ‌రు కాద‌న‌లేరు. దీనిని మ‌రోసారి నిరూపించారు. అయితే… ఈ సినిమాలో చాలా వ‌ర‌కు లాజిక్స్ లేవు. సినిమా అంతా చూసిన త‌ర్వాత ప్రేక్ష‌కుల‌కు చాలా డౌట్స్ వ‌స్తుంటాయి. ఎప్పుడు ఏ సీన్ వ‌స్తుందో..ఆ సీన్ కి ముందు సీన్ కి ఉన్న లింకు ఏంటో అర్ధం కాదు.

మ‌గ‌థీర సినిమాలో చ‌ర‌ణ్ 100 మందిని చంపితే ఈ సినిమాలో 300 మందిని చంపేస్తాడు. తెర‌పై ఆ స‌న్నివేశాలు చూస్తుంటే ఇంత విధ్వంసం అవ‌స‌ర‌మా..? అనిపిస్తుంటుంది. కైరా అద్వాని త‌ల్లిదండ్రులుగా 30 ఇయ‌ర్స్ పృథ్వీ – హేమ న‌టించారు. వీరిద్ద‌రి ల‌వ్ స్టోరీ చూపించి న‌వ్వించాల‌ని ప్ర‌య‌త్నించారు కానీ..ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేదు. ప్ర‌శాంత్, ఆర్య‌న్ రాజేష్, స్నేహ‌, వివేక్ ఒబ‌రాయ్…పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు న‌టించారు. నిర్మాణ ప‌రంగా చూసుకుంటే ఏమాత్రం రాజీప‌డ‌కుండా దాన‌య్య మంచి క్వాలిటీతో నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం బాగుంది. ప్ర‌జెంట్ స‌హ‌జంగా ఉండే సినిమాల‌నే చూడ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. ఇలాంటి టైమ్ లో స‌హ‌జత్వానికి దూరంగా.. విధ్వంసం ఎక్కువుగా చూపిస్తే జ‌నం చూసే ప‌రిస్థితి లేదు. ఈ సినిమా గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే…విన‌య విధ్వంస రామ‌. రామ‌..రామ‌..!

రేటింగ్ – 2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here