Home News విశాఖ రైల్వే జోన్ మోదీ మోసపూరిత నిర్ణయం – చంద్ర‌బాబు

విశాఖ రైల్వే జోన్ మోదీ మోసపూరిత నిర్ణయం – చంద్ర‌బాబు

78
0

 టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ కాన్ఫ‌రెన్స్ లో ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ…ఇప్పటికే 12 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష పూర్త‌య్యింది. అన్ని ఎంపీ సీట్లు, అసెంబ్లీ సీట్లలో పూర్తి సానుకూలత ఉంది. ఇంకా 13 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష చేయాలి. ఈ ఎన్నికలు టీడీపీకే కాదు రాష్ట్రానికే కీలకం. ధర్మపోరాట నిరసనలతో రాష్ట్రం హోరెత్తాలి.  నేను కూడా నల్లచొక్కా ధరిస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా నల్ల చొక్కాలతో నిరసనలు. నల్ల బెలూన్లు, నల్లజెండాలతో నిరసన తెలపాలి.

నరేంద్ర మోదీ విశాఖ రాకను అందరూ నిరసించాలి. మనకు తీరని అన్యాయం చేశారు. 5 కోట్ల ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు. గాయాలను కెలికేందుకే మోదీ విశాఖ వ‌స్తున్నారు. మోదీ తిరిగి వెళ్లేదాకా నిరసనల జోరుతో హోరెత్తాలి. బహిరంగ లేఖలో మోదీ చేసిన ద్రోహాన్ని నిలదీశాను. 5 ఏళ్లలో మోదీ చేసిన అన్యాయాన్ని నిగ్గదీశాను. విశాఖ రైల్వే జోన్ మోదీ మోసపూరిత నిర్ణయం. ఆదాయం లేని జోన్ బీజేపీ కుట్రపూరిత నిర్ణయం. దీనిని రాష్ట్రంలో అందరూ ఖండించాలి. మోదీ నమ్మక ద్రోహాన్ని నిలదీయాలి. మన ఆదాయాన్ని కూడా ఒడిశాకు ఇచ్చారు. జోన్ అడిగితే డివిజన్ కూడా తీసేశారు. రాబడి లేని మాయా జోన్ ను మనకు ఇచ్చారు అని చంద్ర‌బాబు చెప్పారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here