Home Actor విశేషంగా ఆక‌ట్టుకుంటున్న మ‌జిలీ సాంగ్..!

విశేషంగా ఆక‌ట్టుకుంటున్న మ‌జిలీ సాంగ్..!

77
0


అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టిస్తోన్న చిత్రం మ‌జిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా పై పాజిటివ్ టాక్ ఉంది. ఈ చిత్రానికి గోపీ సుంద‌ర్ సంగీతం అందించారు. ఈ రోజు ఈ చిత్రంలోని సాంగ్ ను రిలీజ్ చేసారు. వన్ బాయ్ .. వన్ గర్ల్ లుకింగు .. హైటు .. వెయిటు చెకింగు .. పేరెంట్స్ ఫిక్సింగ్ మ్యాచింగు .. డౌరీ గివింగ్ .. మ్యారేజ్ బెల్సు రింగింగు .. సింగులు బెడ్డూ షేరింగు .. ఇన్ సైడ్ ఫస్టు లవ్ కిల్లింగు .. యూఆర్ డైయింగు .. అంటూ హీరో వైపు నుంచి ఈ పాట సాగుతోంది.

పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి ప‌ట్ల హీరో త‌న మ‌న‌సులో మాట‌లను ఈవిధంగా పాట రూపంలో బ‌య‌ట‌పెట్టారు. భాస్క‌ర‌భ‌ట్ల రాసిన ఈ పాట యూత్ ని బాగా ఆక‌ట్టుకుంటుంది. షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల చేయ‌నున్నారు. చైత‌న్య‌, స‌మంత పెళ్లి త‌ర్వాత క‌లిసి న‌టించిన ఫ‌స్ట్ మూవీ కావ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి…మ‌జిలీ ఏ స్ధాయి విజ‌యాన్ని సాధిస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 5 వ‌ర‌కు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here