Home Actor వీరికి నేను పోటీ ఏంటి..పిచ్చి కాక‌పోతే..? – అన‌సూయ‌

వీరికి నేను పోటీ ఏంటి..పిచ్చి కాక‌పోతే..? – అన‌సూయ‌

22
0
వీరికి నేను పోటీ ఏంటి..పిచ్చి కాక‌పోతే..? - అన‌సూయ‌ spiceandhra

నాగార్జున కెరీర్ లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని  సినిమా మ‌న్మ‌థుడు. త్రివిక్ర‌మ్ క‌థ – మాట‌లతో..కె.విజ‌య‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్ష‌క హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసింది. ఈ సినిమా 2002లో రిలీజైంది. ఇప్పుడు 17 ఏళ్ల త‌ర్వాత మ‌న్మ‌థుడు 2 టైటిల్ తో నాగార్జున సినిమా చేసారు. చి ల సౌ ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇటీవ‌ల రిలీజ్ చేసిన ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ఆగ‌ష్టు 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. అయితే… నాగ్ మ‌న్మ‌థుడు 2 రిలీజ్ అవుతున్న రోజునే అన‌సూయ క‌థ‌నం సినిమా రిలీజ్ అవుతుంది. దీంతో నాగ్ తో పోటీప‌డుతున్న అన‌సూయ అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ వార్త‌ల పై అన‌సూయ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ… అస‌లు వీళ్ల‌కి నేను పోటీ ఏంటి..పిచ్చికాక‌పోతే..? ట‌్రైల‌ర్ చాలా బాగుంది. నాకు ఇష్ట‌మైన నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, రాహుల్ ర‌వీంద్ర‌న్, వెన్నెల కిషోర్ ఈ సినిమాలో ఉన్నారు. నేను న‌టించిన క‌థ‌నం సినిమాతో పాటు మ‌న్మ‌థుడు 2 చూస్తాను అని స్పందించి మ‌న్మ‌థుడు 2 ట్రైల‌ర్ పోస్ట్ చేసారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here