Home Actor వెంకీ అట్లూరి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

వెంకీ అట్లూరి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

133
0

వెంకీ అట్లూరి…తొలిప్రేమ సినిమాతో తొలి ప్ర‌య‌త్నంలోనే ఘ‌న విజ‌యం సొంతం చేసుకున్న యువ ద‌ర్శ‌కుడు. మ‌లి చిత్రాన్ని అక్కినేని అఖిల్ తో రూపొందించిన యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ మిస్ట‌ర్ మ‌జ్ను. ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ నిర్మించారు. ఈ నెల 25న మిస్ట‌ర్ మ‌జ్ను ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా పై అటు అక్కినేని అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. టీజ‌ర్ & ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ రావ‌డంతో సినిమా విజ‌యం పై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నారు చిత్ర యూనిట్.

ఇదిలా ఉంటే…ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత‌ల్లో ఒక‌రైన న‌వీన్ మాట్లాడుతూ… వెంకీ అట్లూరి త‌దుప‌రి చిత్రాన్ని త‌మ బ్యాన‌ర్ లోనే చేస్తున్న‌ట్టు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు. అయితే..హీరో ఎవ‌ర‌నేది మాత్రం చెప్ప‌లేదు. దీంతో వెంకీ అట్లూరి త‌దుప‌రి చిత్రంలో హీరో ఎవ‌రు అనేది ఆస‌క్తిగా మారింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం..వెంకీ నెక్ట్స్ మూవీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ అని తెలిసింది.  విజ‌య్ ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. నెక్ట్స్ మూవీని కూడా ఇదే బ్యాన‌ర్ లో చేస్తాన‌ని విజ‌య్ క‌మిట్ అయిన‌ట్టు టాక్ వినిపిస్తోంది. మ‌రి..త్వ‌ర‌లోనే ఈ మూవీని అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here