Home Actor వెంకీ – చైతు అద‌ర‌గొట్టేసారుగా..!

వెంకీ – చైతు అద‌ర‌గొట్టేసారుగా..!

109
0
వెంకీ - చైతు అద‌ర‌గొట్టేసారుగా..! spiceandhra

విక్ట‌రీ వెంక‌టేష్ – యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ క్రేజీ మూవీ వెంకీ మామ‌. ఈ సినిమాని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకీ స‌ర‌స‌న‌ పాయల్‌ రాజ్‌పుత్‌, చైతు స‌ర‌స‌న‌రాశీ ఖన్నా నటిస్తుండగా.. ఈ మూవీకి ఎస్.ఎస్ తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సినిమా అప్ డేట్స్ గురించి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆస‌క్తితో ఎదురు చూస్తుంటే… ఫ్యాన్స్ కి స‌ర్ ఫ్రైజ్ లా వెంకీ మామ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. చిత్ర ద‌ర్శ‌కుడు బాబీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఈ వీడియో యూట్యూబ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. 28 సెక‌న్లు ఉన్న ఈ వీడియోలో డైలాగులు లేవు కానీ.. వెంకీ, చైతు న‌డిచి వ‌స్తుంటే.. త‌మ‌న్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూప‌ర్ అనేలా ఉంది.

వెంకీ బుల్లెట్ పై మీసం తిప్పుతూ క‌నిపించ‌డం… చైతు న‌డిచి రావ‌డం.. ఆత‌ర్వాత ద‌గ్గుబాటి మామ‌, అక్కినేని అల్లుడు ఇద్దరూ రెడ్ షర్ట్‌ను పైకి లాగుతూ.. స్టైల్ గా అలా న‌డుస్తూ.. అద‌ర‌గొట్టేసారు. సినిమా పై అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచేసారు. టీజ‌ర్ ను ఈ నెల‌లోనే రిలీజ్ చేయ‌నున్నారు. ద‌స‌రాకి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు వెంకీ మామ రెడీ అవుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here