Home Telugu వెంకీ మామ అంటూ చైతు ఏం చేయ‌నున్నాడో తెలుసా..?

వెంకీ మామ అంటూ చైతు ఏం చేయ‌నున్నాడో తెలుసా..?

118
0
Venky Maama regul shoot start

విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్లో మూవీ కోసం అటు అక్కినేని అభిమానులు, ఇటు ద‌గ్గుబాటి అభిమానులు ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి ఎదురుచూస్తున్నారు. ఈ మేన‌మామ – మేన‌ల్లుడు కాంబినేష‌న్లో సురేష్ బాబు సినిమా చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ స‌రైన స్ర్కిప్ట్ కుద‌ర‌క ఇన్నాళ్లు వెయిట్ చేసారు. ఇప్పుడు సరైన స్ర్కిప్ట్ సెట్ అవ్వ‌డంతో ఈ క్రేజీ కాంబినేష‌న్లో మూవీని ఇటీవ‌ల రామానాయుడు స్టూడియోలో సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ తో క‌లిసి నిర్మిస్తోంది. ఆగ‌ష్టు 8 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే…వెంకీ కామెడీ చేస్తే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాల్లో వెంకీ త‌న‌దైన స్టైల్ లో కామెడీ చేసి ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్ టైన్ చేసారు. అయితే…ఈ సినిమాలో వెంకీతో పాటు చైతు కూడా కామెడీ చేయ‌బోతుండ‌డం విశేషం.

ఈ మేన‌మామ – మేన‌ల్లుడు క‌లిసి స్ర్కీన్ పై కామెడీ చేస్తే..ప్రేక్ష‌కుల‌కు పండ‌గే. ఇందులోయాక్ష‌న్ క‌న్నా ఎక్కువుగా కామెడీ ఉంటుంద‌ట‌. జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి రాసిన క‌థ‌కు బాబీ ఇంట్ర‌స్టింగ్ గా ఉండేలా అద్భుత‌మైన స్ర్కీన్ ప్లే అందించారు. ఇందులో చైత‌న్య స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. వెంకీ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషిని తీసుకునే ఆలోచనలో ఉన్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే….వెంకీ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here