Home Actor వెంకీ మామ అఫిషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది..!

వెంకీ మామ అఫిషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది..!

79
0

విక్ట‌రీ వెంక‌టేష్ – యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీ మామ‌. ఈ భారీ క్రేజీ మూవీకి జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పోరేష‌న్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. రియ‌ల్ లైఫ్ లో మేన‌మామ – మేన‌ల్లుడు అయిన వెంకీ – చైతు ఈ మూవీలో కూడా అవే పాత్ర‌లు పోషిస్తుండ‌డం విశేషం. ఈ సంచ‌ల‌న చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ను ఈ నెల 24 నుంచి ప్రారంభించ‌నున్నారు.

వెంకీ – చైతు స‌ర‌స‌న న‌టించే హీరోయిన్స్ గురించి కొంత మంది తార‌ల పేర్లు ప్రచారంలోకి వ‌చ్చాయి. దీంతో ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ లో న‌టించే అద్భుత అవ‌కాశం ఎవ‌రు ద‌క్కించుకుంటారో అనేది ఆసక్తిగా మారింది.  అయితే…సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ  వెంకీ స‌ర‌స‌న ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయ‌ల్ రాజ్ ఫుట్, చైత‌న్య స‌ర‌స‌న రాశీఖ‌న్నా న‌టించ‌నున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా ఎనౌన్స్ చేసారు. అలాగే సంగీతం ఎస్.ఎస్.త‌మ‌న్ అందిస్తున్నారు. రేప‌టి నుంచి ఫ‌స్ట్ షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం అని తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here