Home Actor వెంకీ మామ కోసం.. రాశీఖ‌న్నా రెడీ..!

వెంకీ మామ కోసం.. రాశీఖ‌న్నా రెడీ..!

62
0

విక్ట‌రీ వెంక‌టేష్ – యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీ మామ‌. జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శ‌రవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. వెంక‌టేష్‌, నాగ చైత‌న్య‌ల పై కీల‌క సన్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ తో క‌లిసి పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇందులో వెంకీ స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్ ఫుత్, నాగ చైత‌న్య స‌ర‌స‌న రాశీఖ‌న్నా న‌టిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా షూటింగ్ లో రాశీఖ‌న్నా జాయిన్ అయ్యారు. ఈ విష‌యాన్ని రాశీ ఖ‌న్నా ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. త‌నకు మేకప్‌ వేస్తున్న వీడియోను పోస్ట్ చేసి న్యూ బిగినింగ్‌.. వెంకీ మామ‌ షూటింగ్‌లో మొదటి రోజు అని ట్వీట్‌ చేశారు.

 సురేష్ బాబు, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, కోన వెంక‌ట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సంచ‌ల‌న చిత్రం పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీనికి తోడు ఎఫ్ 2 సినిమాతో వెంకీ సెన్సేష‌న‌ల్ హిట్ సాధించ‌డంతో వెంకీ మామ పై మ‌రింత క్రేజ్ పెరిగింది. అటు అక్కినేని అభిమానులు, ఇటు ద‌గ్గుబాటి అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తోన్న ఈ చిత్రాన్ని ద‌స‌రాకి రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here